వంచనా శిల్పి

0
3

[dropcap]వా[/dropcap]డు –
నన్నెప్పుడూ బాగా నమ్మిస్తుంటాడు
సమయానుకూలంగా సరస సంభాషణలతో అలరిస్తాడు!

ఎన్నిసార్లు నట్టేట ముంచినా
నగుబాటు చేసినా
మళ్ళీ మళ్ళీ నమ్ముతూనే ఉంటాను.

నాకు అవసరం వచ్చినప్పుడు –
తామరాకు మీద నీటి బొట్టై పోతూంటాడు!
తనకు కోరికైతే మాత్రం –
జాలి గొలిపే మాటలతో గేల మేస్తుంటాడు
జోల పాడేస్తుంటాడు!
జోలి పట్టేస్తుంటాడు!

నేను మళ్ళీ మోసపోయానని గ్రహించేలోగా
వాడు ఉట్టి కెగిరి కూర్చుంటాడు!
ఊరిస్తూ నా ఊహలకు ఉరేస్తుంటాడు!

వాడు –
నా కలల రేడు!
నయ వంచనా శిల్పకారుడు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here