వంట

0
2

[box type=’note’ fontsize=’16’] కంటికి నేత్రానందం, ముక్కుకి మహదానందంగా ఆయన వండితే, ఆవిడ ఏమందో భువనచంద్ర “వంట” కవితలో చదవండి. [/box]

[dropcap]బ్ర[/dropcap]హ్మాండమైన పోపు వాసన
ఊరూవాడల్ని అలుముకుంటోంది
ఓ పక్క ఆవాల చిటచిటలు
శనగబద్దల చెటచెటలు
మరుగుతున్న నూనెలో
ఇంగువ ఘుమ ఘుమా
కంటికి నేత్రానందం
ముక్కుకి మహదానందం.

ఓ అరుదైన చెయ్యి…
గరిట తిప్పుతోంది
పక్కనే స్టౌ మీద
పప్పు వుడుకుతోంది.

కలబోసిన అన్నంలో పసుపు
చింతపండు పులుపు
జీడిపప్పు జమాయిస్తే
పులిహోర వవ్హారే…!

వేయించిన వడియాలూ
ఆవలించు అప్పడాలు
విస్తట్లో జమచేస్తే
అదిరిపోవ ‘మెనూ’లు.

ఆహాహా పాయసం
అదిగో సాంబార్ – రసం
గుబాళించు గోంగూర
కనుగీటే సయొనారా.

మారో గారే బూరే
మస్తో మారో యారో
నెయ్యీ పప్పుల సంగమం
ఆవకాయ ఆలింగనం.

ఓ మొరటు చెయ్యి వడ్దిస్తే
ఓ నాజూకు చెయ్యి కదిలింది
కడుపారా తిన్న పొట్ట
బ్రేవ్‌మని తేన్చింది.

“వంట ఎలా వుందీ?”
“మంగలివాద్యం – మగాళ్ళ మంట”
అంతే –
ఆయన కోపంగా అటు
ఈవిడ నవ్వుతూ ఇటు.

అసలు కథేమిటి?
ఆ… ఏవుందీ…
ఇంటావిడ ముట్టైతే
ఇంటాయన వంట చేశాట్ట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here