వారాల ఆనంద్ చిన్న కవితలు 3

8
3

[dropcap]వా[/dropcap]రాల ఆనంద్ రచించిన 7 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.

~~

1) అర్థించానో ప్రేమించానో
నీ ముందర నిలబడ్డాను
నన్ను నేను తెలుసుకున్నాను
~ ~
2) ప్రేమ రూపానివో స్నేహ దీపానివో
దారిలో ముళ్లకంపను తొలగించావు
నా చూపును సవరించావు
~ ~
3) వచ్చినట్టే వచ్చి, వెళ్లినట్టే వెళ్తావు
ఎంతకూ రావు ఎప్పుడూ వెళ్లవు
ఇంతకూ ఎవరు నువ్వు
~ ~
4) వెతికి విసిగి పోయా
ఎదురు చూసి అలిసి పోయా
వినిపించవు కనిపించవు, ఏడిపిస్తావు
~ ~
5) నేనేమిటో నాకు తెలీదు
నువ్వేమిటో నీకు తెలీదు
మనం కలిసేదెన్నడు తెలిసే దెన్నడు
~ ~
6) నడిచీ నడిచీ కూలిపోయా
ఏడిచీ ఏడిచీ కరిగి పోయా
కరగకుండా ఉండలేను శిలలా నిలబడలేను
~ ~
7) నవ్వుల్లో నజరానాల్లేవు
కళ్ళల్లో ఆకాంక్షల ఛాయల్లేవు
ఇద్దరి నడుమా మబ్బుల్లేవు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here