వారాల ఆనంద్ చిన్న కవితలు 5

0
3

[dropcap]వా[/dropcap]రాల ఆనంద్ రచించిన 8 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.

~ ~

1) దిగులుగా నది ఒడ్డున కూర్చున్నా
అలల మీద నీ పాద ముద్రలు
నా కళ్ళల్లో వెలుగు దివ్వెలు
~ ~
2) నది ఒడ్డున సాయంకాలం నడక
వేడిని వదిలేసిన గాలేదో చుట్టుకుంటోంది
అలసట కాదు అజ్ఞానమేదో ఆవిరవుతున్నది
~ ~
3) నడక పరుగునందుకునే వేళ
కూలిపోయా కూడదీసుకున్నా
కవిత్వమూ నేనూ కూడ బలుక్కున్నాం
~ ~
4) చెప్పా చేయకుండా బయలెల్లినవ్
కళ్ళ ముందటి పచ్చదనం బయలు బయలైంది
నువ్వు నాటిన విత్తనమేదయినా మొలకెత్తక పోతుందా
~ ~
5) రోజూ కలిసేవాళ్లం కాదు
కరచాలనం చేసేవాళ్లమూ కాదు
అట్లని నాలుగు దశాబ్దాలుగా చేయి విడిచిందీ లేదు
~ ~
6) నువ్వు బయటి విషయాలు చెప్పేవాడివి
నేనే లోపలి విషయాలు మాట్లాడేది కాదు
ఇద్దరికీ రెండూ అర్థం అయ్యేవి
~ ~
7) నల్ల ముఖాలు అంటూ నవ్వేసేవాడివి
నేనేమో తెల్ల ముఖం వేసే వాడిని
నలుపు తెలుపు కాలం నడిచెళ్లిపోయింది
~ ~
8) ‘చురకలకు’ చిందులేసావు
‘ముక్తకాలకు’ మురిసిపోయావు
‘ముసాఫిర్’ లా వెళ్లిపోయావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here