Site icon Sanchika

వారాల ఆనంద్ చిన్న కవితలు 7

వారాల ఆనంద్ గారు రచించిన 10 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.
~ ~

1)
నిద్ర దూరం
రాత్రుళ్లు సుదీర్ఘం
మెలకువ చీకటి పెనవేసుకున్నాయి
~ ~
2)
ఎండలో వానలో తిరిగీ తిరిగీ
తడి తడై పొడి బారిపోయా
బతుకు బండికి రెండు పట్టాలు
~ ~
3)
పలకరించాలి పలవరించాలి
పెనవేసుకోవాలి
ఎవర్ని.. నన్నే
~ ~
4)
కాలినడకన శిఖరం చేరానుకుంటాను
అదేమో నల్లటి మబ్బెప్పుడొస్తుందా
తలంటు పోస్తుందా అని ఎదురు చూస్తుంది
~ ~
5)
బతుకు ప్రయాణంలో
ఎందరో స్నేహితులు
ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగి పోయారు
~ ~
6)
దుష్మన్లకు తక్కువ లేదు
దోస్తులకు కొదువలేదు
ఒకరు దోచారు మరొకరు ముఖం చాటేశారు
~ ~
7)
చెట్టూ చేమా పచ్చదనం
గ్రీన్ ఛాలెంజ్
వాగు ఒడ్డు ఇసుక ఓడిపోయింది
~ ~
8)
సెలెబ్రిటీలు మొక్కలు నాటారు
పోజులిచ్చారు ఫోటోలు దిగారు
అడివంతా ఎడారై ఏడ్చింది
~ ~
9)
నాతో నేను నీతో నువ్వు
చర్చించుకుంటాం ఘర్షణ పడతాం
అన్యోన్య దాంపత్యం
~ ~
10)
దొరికింది చాలా దొరికింది
అయినా సంతోషం లేదు
దొరికిందేది పోగొట్టుకున్నది కాదు
*

Exit mobile version