Site icon Sanchika

వారాల ఆనంద్ హైకూలు-4

[dropcap]సం[/dropcap]చిక పాఠకుల కోసం శ్రీ వారాల ఆనంద్ రచించిన 8 హైకూలను అందిస్తున్నాము

9)
రాలుతున్న పండు టాకులు
దట్టమయిన కొమ్మల మధ్య
దుఃఖ ధ్వని

10)
ఏక ధారగా వాన
వారం రోజులుగా గడప దాటలేదు
నేనూ సూర్యుడూ

11)
వాన తడిసిన ఉదయం
నింగీ నేలా పదన పదన
మనసింకా ఆరలేదు

12)
నడిరాత్రి దీపం వెలుగులో
అక్షరాలు వణికాయి
కాగితం తెల్ల బోయింది

13)
వాకిట్లో అందమయిన ముగ్గుల్ని
వాన తుడిచేసింది
ఆమె కళ్ళల్లో తడి చేరింది

14)
వాగు పొంగింది
చెరువు నిడింది
నింగిలో పక్షుల గుంపు కువ కువ

15)
ఉదయం చినుకుల మధ్య
గాలి తిరుగుతున్నది
టీ కప్పులో ఇరానీ చాయ్ ఘుమ ఘుమ

16)
ఆమె కంటి నిండా ఎదురు చూపులు
పోస్ట్ మాన్ కోసమో
ప్రేమ లేఖ కోసమో

Exit mobile version