Site icon Sanchika

వరాల చెరువు

[box type=’note’ fontsize=’16’] ‘వరాల చెరువు‘ అనే ఈ కథలో జలవనరులు కలుషితమవడం వల్ల, మనుషులకు, జంతువులకీ ఎదురవుతున్న ప్రమాదాన్ని వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]బో[/dropcap]నాల పండుగ రోజులు. అనామిక అమ్మ నాన్నలతో కలిసి తాత నానమ్మలతో బోనాల పండగ జరుపుకోవటానికి వాళ్ళ గ్రామానికి వచ్చింది. పట్టు లంగా, వెండి పట్టీలు, గాజులు వేసుకుని ట్రెడిషనల్‌గా తయారయ్యి బోనం ఎత్తిన అమ్మ వెనుక అత్త చేయి పట్టుకుని అందరితో కలిసి పోచమ్మ గుడికి వచ్చింది.

అక్కడంతా ఏంతో సందడిగా ఉంది. కలర్ ఫుల్ గా ఉంది. అమ్మలందరు ఫామిలీ, ఊరు, ప్రజలు హ్యాపీగా ఉండాలని, వానలు సరిగా పడాలని, ఫుడ్ బాగా దొరకాలని అనామిక భాషలో అంటే పంటలు పండాలని విష్ చేసారు.

చిన్నారి అనామికతో నానమ్మ “అనామిక! పోచమ్మ తల్లికి మొక్కు బిడ్డ!” అంది.

“మొక్కు? అదేంటి?” అనుకుంటూ అటు ఇటు చూసింది. పక్కనే ఉన్న అత్త తనకి ఏమి కావాలో అడగటం వింది. ఓహ్! మొక్కటం అంటే ఇదా! ఓకే అనుకుని చేతులు జోడించి కళ్ళు మూసుకొని పిల్లిలా మధ్యలో తెరుస్తూ

“అవునూ ఇప్పుడు నేను ఏమని మొక్కాలి పోచమ్మకి. ఆ! పోచమ్మ దేవత! పోచమ్మ దేవత! ప్లీజ్! నాకొక విష్ ఉంది. అదేమంటే? నా విష్ లన్ని నిజం అయ్యేలా నాకొక విష్ ట్రీ ని ఇవ్వు. ఓకేనా? విష్ ట్రీ కావాలి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్” అని అమాయకంగా అడిగింది.

ఓకే అన్నట్లు అయ్యవారు పోచమ్మ దేవత మీది పువ్వు ఒకటి అనామిక చేతిలో పెట్టారు.

“అనామిక! నీ మొక్కు పోచమ్మ తల్లి విన్నది” అంది అత్త.

ఇంతలో తాతయ్య “అనామిక! రా బిడ్డ! దుకాణాలు తిరిగొద్దాము” అని పిలిచారు. గుడి బైట ఉన్న గ్రౌండ్‌లో పెట్టిన దుకాణాలు తిరిగి చూసారు.

“తాతయ్య! తాతయ్య! ఐ లవ్ యువర్ హౌస్, యువర్ విలేజ్” అంది.

“అవునా, నా కాదు మన ఊరు, మన ఇల్లు” అన్నారు తాతయ్య. “దసరా సెలవుల్లో రా! ఎక్కువ రోజులుండి అందరితో కలిసి బతుకమ్మ ఆడుదువుగాని.”

“ఓకే. సరే. వస్తాను” అంది అనామిక

 సాయంత్రం పిల్లలతో కలిసి ఊరి చెరువు చూడటానికి వెళ్ళింది. దోవలో అదోరకం వాసనతో నురుగులు వస్తున్నా నీటిని చూసింది. చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద యాక్! యాక్! షిట్!

గట్టు చుట్టూ ఉన్న చెట్లు కట్ చేస్తున్నారు.

“పచ్చటి చెరువుని చెట్లని పాడుచేస్తున్నారు. ఊరు బాగుండేది ఎలా?”

“అందరు కలిసి క్లీన్ చేస్తే బాగుండు” అన్నారు అన్నలు.

ఇంటికి వచ్చిన అనామిక ‘ఊరి చెరువు ఎందుకు ఇంపార్టెంట్? ఇట్స్ యాక్!’ అనుకుంది.

చెరువు, విష్ ట్రీ గురించి ఆలోచిస్తూ పడుకుంది అనామిక.

***

పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఏమికనపడలేదు. ఇంతలో ఎవరో అనామిక చెయ్యి పట్టుకుని ఆ వెలుగులోకి తీసుకెళ్లారు. అనామిక మొదట కంగారు పడిన, వెలుగు సంగతి తెలుసుకోవాలని ఉత్సాహపడింది. ఎక్సయిట్ అయింది. ధైర్యంగా వెలుగులోకి ట్రావెల్ అయింది.

కళ్ళు వెలుగుకి adjust అయినతరువాత ఎదురుగ క్లీన్‍గా ఉన్న చెరువు కనపడింది. దానిపక్కనే గట్టు మీద పెద్ద పెద్ద పచ్చని గ్రీన్ ట్రీస్ కనిపించాయి. ఫ్రెష్ ఎయిర్. అంతేకాదు చాల వెరైటీస్ బర్డ్స్ కనిపించాయి. సువాసనలు వస్తున్నా అరోమాటిక్ ఫ్లవర్స్ పువ్వులు కనిపించాయి రంగుల్లో. ఇంకొంచం దూరంలో దీపావళి లైట్స్ లా వెలిగి ఆరుతు రంగులు చేంజ్ అవుతున్న beautiful tree కనపడింది.

“హే! my wishing tree!” అని అరుస్తూ ఆ చెట్టు క్రిందకు పరుగెత్తింది అనామిక.

అక్కడ గ్రీన్ డ్రెస్ లో ఒక అబ్బాయి, బ్లూ డ్రెస్ లో ఒక అమ్మాయి కనిపించారు.

హలో! ఐయామ్ అనామిక! మరి మీరు?”

“ఐ యామ్ లేక్… చెరువు” అంది అమ్మాయి

“ఐ యామ్ యువర్ విషింగ్ ట్రీ” అన్నాడు అబ్బాయి

“wow really? it’s amazing.”

“అవునా? ఆశ్చర్యంగా ఉందే.”

“అర్ యు రియల్లీ లేక్?”

“అవును. చెరువుని.”

“మరి నిన్న సాయంత్రం చెరువు దగ్గర చాల చెత్తగా వాసనగా ఉందేంటి?” అడిగింది అనామిక.

“చెత్తగా ఉందా?” అంది చెరువు

“అవును. చాల చాల. లేక్ టెల్ మీ వన్ థింగ్”.

“ఏంటా వన్ థింగ్?”

“మా తాత చెరువు/లేక్స్ చాల ఇంపార్టెంట్ అన్నారు. యు అర్ జస్ట్ ఆ వాటర్ బాడీ, వై అర్ యు ఇంపార్టెంట్? చెరువులు అవసరమా?” అంది అనామిక

“అనామికా నీ ప్రశ్నకు జవాబు కావాలంటే… ఐ మీన్ ఆన్సర్… మా మీటింగ్ కి వచ్చి విను” అంది చెరువు.

“మీటింగ్? ఎక్కడ? where? ఎవ్వరితో?” అంది అనామిక

“ఉష్! సైలెన్స్”.

అనామికని ఒక ప్రక్కగా పెద్ద చెక్కతో చేసిన చైర్ లాంటి దానిమీద కూర్చోమన్నారు.

మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ముందుగా అక్కడికి వచ్చిన లేక్ /చెరువు, ట్రీ,ఫిష్, కప్పలు, బర్డ్స్ /పక్షులు, తాబేళ్లు, బాతులు పేరు తెలీని కీటకాలు, butterflies, తూనీగలు ఇంకా చాల చాల క్రీచర్స్ /జీవులు అందరు నుంచుని natural anthem పాడారు. అనామికకి భాష అర్ధం కాకపోయినా వినసొంపుగా అంటే మెలోడియస్ గా అనిపించింది. లేచి నుంచుంది వినయంగా. అందరు సెటిల్ అయ్యాక చెరువు మీటింగ్ స్టార్ట్ చేసింది.

“మై డియర్ ఫ్రెండ్స్! మనం ఇవ్వాళా మనం, మన పర్యావరణం, ప్రకృతి ఎదుర్కుంటున్న సవాళ్లు, వాటి పర్యవసానం అంటే ఎఫెక్ట్స్, క్లైమేట్ చేంజ్‌ని ఎలా ఎదుర్కోవాలి? ఎలా మనం బ్రతకాలి? అనే వాటిని డిస్కస్ చేద్దాము.

ముందుగా ఫ్రాగ్స్/కప్పలు లేచి “ఫ్రెండ్స్/ మిత్రులారా! మారుతున్న క్లైమేట్ వల్ల మా జీవితం/లైఫ్ ప్రమాదంలో పడింది.. మేము బ్రతకలేకపోతున్నాము. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. సేవ్ అస్” అన్నాయి ఏడుస్తూ.

“పాపం కదా?”

చెరువు మాట్లాడేలోగా అనామిక “డేంజర్! ప్రమాదం! కప్పల లైఫ్ డేంజర్ లో ఉందా? అందుకేనా మా తోటలో ఇంట్లో కనిపించటము లేదు” అంది.

“అనామిక! ప్లీజ్! ఆగు. నన్ను చెప్పని. మీ మనుషులు వాడే రసాయనాలు కెమికల్స్ ఎరువులు, పురుగు మందులు, ఇళ్లల్లో వాడే క్లీనింగ్ లిక్విడ్స్, సబ్బులు అనేకం నీటిలో కలిసిపోయి కప్పల ఇల్లు అదే నీరు కలుషితం/పొల్యూట్ అయి వాటి ఎగ్స్, పిల్లలు చనిపోతున్నాయి. ఫ్రాగ్స్ కనపడకుండా పోతున్నాయి. నాకు గుర్తు 5 ఏళ్ళ క్రితం కూడా నా చెరువులో, గట్లమీద, ఇంటిలో కప్పలు స్మాల్ అండ్ బిగ్ హ్యాపీ గా తిరిగేవి. కానీ ఇప్పుడు మీరు కప్పలు ఏవి? అనే లోపలే అదృశ్యం అవుతున్నాయి” అంది బాధగా చెరువు. ఆ మాటలు విన్న కప్పలు గట్టిగ ఏడిచాయి.

చెరువు కోపంగా “అనామిక! యు సెల్ఫిష్ పీపుల్ స్టాప్ యూజింగ్ కెమికల్స్. మీరు రసాయనాలు వాడటం ఆపండి. కనీసం తగ్గించండి. నా వాటర్ ని పొల్యూట్ చేస్తున్నారు. నీకు తెలుసా? కప్పలే కాదు ఫిష్,ట్రీస్, ఎయిర్, బర్డ్స్ అందరికి same problem./ఇదే సమస్య .”

“అవునా? మేము మీ కష్టాలకి కారణమా? వీళ్ళు లేకపోతే ఏంటి?” అంది అమాయకంగా అనామిక.

“లేకపోతే ఏంటా? పర్యావరణ సమతుల్యం అంటే ఎకోలాజికల్ బాలన్స్ లో ఫుడ్ చైన్ లో పెద్ద జీవి చిన్న జీవిని తింటుంది. అది ప్రకృతి నియమం. రూల్. నీకు అర్ధం కావాలంటే మురుగు/నీటి లో ఉండే కప్ప, చేప రోగాలు/ఫీవర్స్ తెచ్చే దోమ ఎగ్స్, ఇతర క్రిముల పిల్లల్ని తిని మీకు మలేరియా,డెంగీ,కలరా లాంటి ఫెవర్స్ రాకుండా సేవ్ చేస్తాయి. అలాగే ఇతర కీటకాలు,పక్షులు,జంతువులూ వాటి ఫుడ్ ని తింటూ మీకు మీ పంటలకు హెల్ప్ చేస్తున్నాయి. రోగాలు రాకుండా. Nature లో ప్రతి జీవికి ఒక స్పెషల్ డ్యూటీ ఉంది. ఎవ్వరు వేస్ట్ కాదు” అంది చెరువు.

ఇంతలో చెట్లు మాట్లాడటం స్టార్ట్ చేసాయి.

“మమ్మల్ని నరికి చంపేస్తున్నారు. బతకనియ్యటం లేదు. అడవుల్లోకూడా చంపేస్తున్నారు” అన్నాయి విచారంగా. కోపంగా.

 అనామికని చూసిన ట్రీస్ “మీ నీడ్స్/అవసరాల కోసం మమల్ని అడవుల్ని నరికి ఇల్లు, రోడ్స్, బిల్డింగ్స్ కడుతున్నారు. మీకు ఎంత ఉన్నా చాలదు. యు అర్ గ్రీడీ. అందుకే మీరు క్లైమేట్ చేంజ్ తో సఫర్ అవుతున్నారు” అన్నాయి కోపంగా.

పాపం! అనామిక బెదిరిపోయింది. “క్లైమేట్ చేంజ్. ట్రీస్. మాకేం ఇబ్బంది?” అంది.

“నువ్వు చిన్న పిల్లవి నీకు అర్ధం కాదులే” అన్నాయి ట్రీస్

“నో. నేను చిన్న పిల్లను కాదు. I am a big girl. 10 yrs. I can understand” అంది కోపంగా

“వెయిట్. విను. ట్రీస్ ని కొట్టి చంపేసి, వాటర్ని, సాయిల్.. నేలని రసాయనాలతో pollute చేస్తే మీకే ఇబ్బంది. Temperatures వేడి ఎక్కువై ధ్రువాల్లో ఉండే మంచు కరిగి సముద్ర మట్టాలు sea levels పెరిగి తీరప్రాంతాలు మునిగిపోతాయి. పెద్ద వానలు వరదలు land slides రావచ్చు. సిటీస్ లో వేడి 50 డిగ్రీలు దాటి నీరు ఆవిరి అయ్యి తాగటానికి, పంటలకు దొరకదు” అంది విషింగ్ ట్రీ.

“Destruction. చెరువులు ఎండిపోయి లేదా మీ బిల్డింగ్స్ కోసం వాటిని పూడ్చేసి బిల్డింగ్స్ కడితే మీకు వానలు పడినప్పుడు వాటర్ ని స్టోర్ చెయ్యటానికి చెరువులు లేక నీరు సముద్రం లో,మురికి కాలువల్లో కలిసిపోతుంది. నీళ్ళకి కరువు. Scarcity. వస్తుంది  Chennai city లో ఎండాకాలంలో వాటర్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడ్డారు. పక్క స్టేట్స్ వాళ్ళు వాటర్ ట్రైన్స్ పంపారు.”

“యా. ఐ రెమెంబెర్. టీవీ లో చూసాను.”

“వాటర్ ని పాడుచేస్తే నువ్వు చూసినట్లే మురికిగా,నురుగులతో ఉండి తాగటానికి, పంటలకు పనికిరావు. ఒకవేళ ఆ నీటితో పంటలు పండిస్తే మీ ఫుడ్ లో కెమికల్స్ వెళ్లి మీ హెల్త్ పాడవుతుంది” అన్నాయి బర్డ్స్/పక్షులు.

“అంతేనా మీ వల్ల నేను గాలి ని కూడా కలుషితం అవుతున్నా. మీరు నన్ను పీల్చకతప్పదు. అందువల్ల మీకు అనేక రోగాలు” అంటూ, “అవునూ! ఢిల్లీ లో ఆక్సిజన్ షాప్స్ పెట్టారుటగా! గంటకి 300 రూ ఇచ్చి క్లీన్ ఎయిర్ ని పీలుస్తున్నారుట కదా? పాపం” అంది గాలి ఎగతాళిగా

“మీ వెధవ పనులవల్ల ఎండలు పెరిగి వానలు పడక ఫుడ్ పండక మాకు మీకు ఫుడ్/ తిండి దొరక్క చనిపోతాము. అంతా మీవల్లే” అంది కోపంగా బాతు

“అవును. మీ వల్లే క్లైమేట్ పిచ్చిగా తయారయ్యింది. వరదలు వచ్చి మేము కొట్టుకుపోతున్నాము. మీ ఫుడ్ /పంటలు, ఇళ్ళు, రోడ్స్ అన్ని పాడవుతున్నాయి” అంది తాబేలు

“ఆగండి ఆగండి! చిన్నారి అనామికను భయపెట్టకండి” అంది మెరుపులా విషింగ్ ట్రీ

విషింగ్ ట్రీ ని గట్టిగా పట్టుకున్న అనామిక “సారీ సారీ! I mean it” అంది చెవులు పట్టుకుని ఏడుస్తూ. కన్నీళ్లు బుగ్గల మీదనుండి జారుతున్నాయి. అది చూసిన గాలి రివ్వున అనామిక చుట్టూ చల్లగా తిరిగింది. Its ok అన్నట్లు.

“మిమ్మల్ని సేవ్ చెయ్యాలంటే నేను ఏమి చెయ్యాలి?”

అనామిక కన్నీళ్లు తుడిచిన చెరువు “నీ లాంటి మంచి పిల్లలు మా బాధను/పెయిన్ అర్ధం చేసుకుని ప్రకృతి/నేచర్ ని సేవ్ చెయ్యటనికి ట్రై చేస్తే మేము మీరు సేఫ్. చెరువుల్ని క్లీన్ చెయ్యమని పెద్దల్ని అడగండి. చెట్లు నాటండి. మురుగుని నీళ్లలో కలవనివ్వకండి. ac ల వాడకం తగ్గించండి. మీ యాక్షన్ ని బట్టే నేచర్ రియాక్షన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి” అంది.

“అలాగే. మా ఫ్యామిలీకి చెబుతాను. మరి నేను పోచమ్మ తల్లిని విషింగ్ ట్రీ ని అడిగాను. ఇవ్వలేదు” అంది విచారంగా అనామిక

“నీకు విషింగ్ ట్రీ ఇచ్చింది కనుకే మేము అందరం కనిపించాము.”

“విషింగ్ ట్రీ నువ్వు నాతో వస్తావా? నా రూమ్‍౬లో పెడతాను” అంది అమాయకంగా.

“వస్తాను. నేను విషింగ్ ట్రీ ని కాదు. చెరువు వరాల దేవత. చెరువు బాగుంటే అందరము, మీ ఊరు బాగుంటుంది. తెలుసా?”

“సరే. నీకు మాత్రమే కనిపిస్తాము, వినిపిస్తాము” అన్నాయి చెట్టు, చెరువు.

ఇతర జీవులన్నీ “అనామికా! మీరు చెరువును శుభ్రపరిచి మంచి నీటిని కాపాడితే మీరు మేము ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. క్లీన్ చెరువు నీరు అంటే ఆరోగ్యం. వానలు పడి ట్రీస్ పెరుగుతాయి. గాలి కలుషితం అవదు అంటే క్లీన్ ఎయిర్” అంది గాలి.

చెరువే కదా అని నిర్లక్ష్యం చేస్తే తిండికి, నీటికి కరువు. రోగాలు,ఎండలు. ఊరికి చెరువు అమ్మలాంటిది.

అందరికి bye bye చెప్పిన అనామిక వెలుగుల విషింగ్ ట్రీ ని తీసుకునివచ్చి టేబుల్ మీద పెట్టి నిద్రపోయింది.

ఉదయం నిద్రలేచి చూస్తే టేబుల్ మీద వెలుగులు చిమ్ముతున్న sparkling విషింగ్ ట్రీ కనపడింది. దాన్ని చేతులోకి తీసుకుని చెరువుని క్లీన్ చెయ్యాలని విష్ చేసింది.

కొద్దిసేపటి తరువాత తాతయ్యలు, మామలు, ఇంకా ఊరి వారందరు చెరువును శుభ్రం చెయ్యటానికి వెళ్ళటం చూసిన అనామిక పరుగున వెళ్లి తన ఫ్రెండ్స్‌ని కూడా పిలిచి అందరు చెత్త వెయ్యటానికి బాగ్స్ పట్టుకుని వెళ్లి అందరితో కలిసి పరిసరాలు క్లీన్ చేసారు.

చెరువుని క్లీన్ చేసాక చుటూ చెట్లు నాటారు. చెరువులోకి మురుగు, రసాయనాలు కలవకుండా మురుగుని దారి మళ్లించారు. చెరువు గట్టున ఉన్న మైసమ్మ గుడికి రంగులు వేశారు. అందరి వర్క్‌ని ఆమోదిస్తున్నట్లుగా మర్నాడు వానలు మొదలు అయ్యాయి. చెరువు నిండి ఊరికి పండగ వాతావరణం వచ్చింది.

“Thank you wishing tree. Thank you పోచమ్మ తల్లి” అంది అనామిక ఆనందంగా.

***

దసరా పండక్కి ఊరికి వెళ్లిన అనామికకు శుభ్రమైన నీటితో నిండు కుండలా tankful గా ఉన్న చెరువు, గట్టు మీద చుట్టుపక్కల పచ్చగా పెద్దగా పెరిగిన చెట్లు, పంట పొలాలు, పూల తోటలు కనిపించాయి. చెరువు గట్టు శుభ్రంగా ఉంది. యాక్! యాక్! లేవు. బతుకమ్మల నిమజ్జనంకి చెరువులో కాకుండా పక్కాగా కట్టిన పెద్ద నీటి తొట్టి కనిపించింది.

ఆ తొట్టిలో బతుకమ్మలను వదిలి,తరువాత నానిన పూలను ఎరువుగా మొక్కలకు వేస్తామని మామ చెప్పారు.

సాయంత్రం ఊరి ఆడపడుచులతో కలిసి చెరువుకు బతుకమ్మలతో వెళ్లి కోలాహలంగా ఆడిపాడి నీటిలో వదలటానికి అనామిక తన చిన్ని బతుకమ్మను మామకి అందించింది. పూలదీపంతో నీటిలో తేలుతున్న బతకమ్మని చూసి కేరింతలు చప్పట్లు కొట్టింది. అమ్మమ్మ పెట్టిన సత్తుపిండి తింటూ అందరితో ఇంటి దారి పట్టింది.

చెరువులు,నదులు,అంతెందుకు సముద్రాలూ కూడా జీవుల మనుగడకు/life కి ఆధారాలు. మన భూగోళాన్ని… Blue planet ని కాపాడుకుందామా! ప్రకృతిలోని అనేక జీవుల్లో మనం అంటే humans ఒక చిన్ని భాగం మాత్రమే. కానీ ప్రకృతి విధ్వంసం/destruction లో మాత్రం very big part/role. మనం మారదాము. Live and let live.

Exit mobile version