[dropcap]స[/dropcap]ర్వ మతములు సమానమ్మని చెప్పుచున్నది రాజ్యాంగము
మర్మమేదో తెలియవలెనోయ్, మతము లక్ష్యము శాంతిపథమని
ధర్మజీవనమునకు మతము, దారి జూపును మానవాళికి.
కర్మభూమిన ఆదిశంకరాచార్య మతముల నోడించెను.
ధర్మస్థాపన జేసిచూపెను వేద ధర్మమ్మొక్కటేయని.
మతమును స్థాపించు నొక్కదు, దాని కొక్క తేదీ యుండును
హిందు వనగ ధర్మధారయె కాని మతము కాదు మిత్రమా!
పరమాత్ముని సృష్టియందు వేద ధర్మమె హిందు ధర్మము.
విశ్వప్రజ కాచారణ మాయె, ధర్మధార మొదటి సందియు
దైవదూతల పేర వెలసెను, మతములెన్నో మధ్య కాలము.
మత దేశమ్ములను విడచి, మన దేశము వైపు జూచిరి
దొంగతనముగ చొచ్చుకొచ్చిరి, ముస్లిముల సంఖ్యనే పెంచిరి
ఇతర మతముల వారు గూడా, వచ్చిరి మరి శరణువేడిరి
శరణుజొచ్చిన వార్కి పౌరసత్వ మిచ్చుటయే దాతృత్వము
మత మౌఢ్యుల సంఖ్య పెరుగుట భారతావనికే ప్రమాదము.