Site icon Sanchika

వారెవ్వా!-12

[dropcap]మ[/dropcap]తాతీతము, కులాతీతము
మనది భారత రాజ్యాంగము.

మతము పేరున అధిక సంఖ్యా
కులను దోసిరి చిక్కులయందు.

అధిక సంఖ్యాకులే రెండవ
పౌరులైరి స్వదేశమున.

అంబేద్కర్ ఆత్మక్షోభకు
పాలకులు కారకులుయైరి.

స్వరాజ్యము వచ్చింది గాని
సురాజ్యముగా మారునెప్పుడు?

***

ప్రతీ మండల మందు మైనార్
టీల రెసిడెన్షియల్ స్కూల్స్.

మెజార్టీలను వేరు జేసిరి
బీసి, యస్సీ, యస్టీలుగ.

వారి కొరకే నిర్వహించిరి
ప్రభుత్వావాసముల స్కూల్సు.

అగ్రవర్ణ పేదలకు కన
రావు ఆవాస విద్యాలయాలు.

ప్రభుత్వం పాలసీ యేమిటి?
పరమాత్మకే తెలియ వలెనోయ్!

***

దేవతలు పారాడి దీనిని
దివ్యసీమగ మార్చినారు.

సర్వమానవ సమానత్వము
భారతీయుల విశ్వాసము.

సర్వ మతములు సమానమ్మని
ధర్మమే చెప్పింది నాడు.

హెచ్చుతగ్గుల మాయాజాలము
ఓట్ల బాగోతమ్మే గద!

ఎంతకాలము సాగుచుండును
ఎవరికేమీ తెలియదాయెను.

Exit mobile version