Site icon Sanchika

వారెవ్వా!-13

[dropcap]మో[/dropcap]డర్న్ కాలేజ్ యువతుల
వేషధారణ విచిత్రాలు.
ఒంటికతికె జీన్ పాంటు, షర్టు
ఎత్తుపల్లముల ప్రదర్శన.
వోణి ఫ్యాషను పాతదాయె
క్లాసులోన కల్లోలమాయె.
గంతులేసెడు యువ కిశోరుల
చూపులన్నీ వాళ్ళ మీద.
పాఠమేమో బుర్ర కెక్కదు
పారె పిచ్చి ఆలోచనలు.

***

కాలేజీ వదలగానె కళ్ళు
జిగేల్ మనె యువతి యువకులు.
ఎవరి మనసున యేమి వుందో
వారికే తెలియాలి నిజము.
లవ్వు పేరున కొవ్వు పెరిగిన
పెళ్ళి దాక వెళ్ళలేవు.
అప్పుడప్పుదు కీచులాటల
క్రీడలైనా కీడు లేదు.
ప్రేమ ముదిరిన నవ్వులాటలు
కన్నవారికి సంకటాలు.

***

లవ్ జిహాదుల లంపటమ్ములు
తల్లిదండ్రుల పరేశాను.
యువతి మతము మార్పిడాయెను
గతము జ్ఞప్తికి రాకపోయెను.
తాత్కాలిక గుడ్ది ప్రేమన
తన్నులాట గుద్దులాటలు.
యువతి బంధువులంత ఏడ్చిరి
భవిత లేదని వదిలివేయ.
తల్లిదండ్రుల ప్రేమ కరువై
యువతి బతుకు బాధ గాథలు.

Exit mobile version