[dropcap]స్మా[/dropcap]ర్టు ఫోనులు జీవితములో
పార్టులైనవి పరవశించి.
మహా బుల్లి తెరను జూడగ
మనసు ఆరాటము మరలును.
సెల్లు ఫొనుల లోకమున్నది
శ్రద్ధగానే చూడ వలయు.
అన్‌లిమిటేడ్ మాట లందున
మజా యున్నది మన యువతకు.
ఎట్ల ఉపయోగించుకుంటే
అట్లనే వుంటుంది ఫలితము.
***
పిల్ల చేతికి సెల్లునిచ్చిన
తగ్గిపోవునల్ల రపుడే.
ఏ ఛానల్లేమి యుండునో
తెలిసిపోయె పిల్లవాళ్ళకు.
పనికిమాలిన పాట ఆటకు
నిలయమాయె కొత్త యాపులు.
అదే చూస్తూ ఆనందముగ
తిండి తింటు నిద్రబోదురు.
సెల్లు కలవాటైన పిల్లలు
లొల్లి జేతురు లేకపోతె.
***
కంటి చూపులు, మెదడు ఊపులు
కుంటుబడు నలవాటుకే.
కొత్త రోగము లొచ్చి బుర్రకు
బూజు బట్టును భవిష్యత్తున.
పిచ్చిపిచ్చిగ మారిపోదురు
పనులు జేయ మానివేతురు.
అంతుబట్టని అనారోగ్యము
తల్లిదండ్రికి పరేశాను.
తెలిసినా అశ్రద్ధజేతురు
తెలివిమీరిన పెద్దవారు.