వారెవ్వా!-15

0
2

[dropcap]దే[/dropcap]శ విభజన జరగగానే
మైనార్టీలైదు శాతము.
ఖండభారత అధిక సంఖ్యాకులు
తొంబయ్యైదు శాతము.
ఇపుడు మైనార్టీల సంఖ్య
ఇరవయ్యైదు శాతముంది.
అపుడు పాకిస్థానమున మై
నార్టీలు ముప్పదిశాతము.
ఇపుడు హిందు మైనార్టీలు
ఒకటిన్నర శాతమయ్య!

***

ఇతర దేశాల నుండి చొచ్చు
కొచ్చిన ముస్లిములే కోట్లు.
మతము మార్పిడి ద్వారా సంఖ్యను
పెంచుకుంటూ పంచుకొనిరి.
పౌరసత్వము చట్టమే పరి
హాసమాయెను మాయలోన.
ఓట్ల కోసము రాజకీయులు
దేశభక్తిని మరిచిపోయిరి.
మతమౌఢ్యమున్ ప్రోత్సహించిరి
దేశభవితను ఫణము పెట్టిరి.

***

పౌరసత్వము చట్టసవరణ
చేయుటయే అన్యాయమనుచును
ఉద్యమాలకు ఊపిరూదుచు
చట్టమే తమ చుట్టమనిరి.
ఒకే వర్గము మేధావులకు
తిరోగమనము తిక్కరేగ
చట్టసవరణ నష్టమేమిటో
చెప్పలేక పరుగులెత్తిరి
వేల కాశ్మీరు పండితులను
తరిమినప్పుడు ఏం చేసిరి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here