వారెవ్వా!-17

0
2

[dropcap]మా[/dropcap]తృభూమికి వందనమ్మిడ
మాన్య పౌరుల కర్తవ్యము.
కర్తవ్యమది కాదనంటే
కఠిన హృదయపు ద్రోహమే.
ఈ దేశము మట్టి గంధమున
పుట్టినాడు భరత పుత్రుడు.
తల్లికి పాద నమస్కారము
తనయులకు శుభ సంకేతము.
వందేమాతర మననివాడు
భారతీయుడు కానె కాదు.

***

భారత స్వాతంత్ర్య సమరము
దేశభక్తి దివ్య యజ్ఞము.
యజ్ఞ సమిధల తలచుకొనుటయె
భవ్యమైనది భారతమునకు.
వందేమాతర గీతమునకు
అదే మంత్రము, తంత్రమాయె.
స్ఫూర్తి బొందిరి దేశభక్తులు
సన్యాసులు పోరు సలిపిరి.
విదేశీయుల కుత్తుకల తా
ముత్తరించిరి ఖడ్గములతో.

***

వందేమాతర గీతమందున
మత ప్రచారమున్నదనిరి.
కన్న నేలకు వందనమ్మన
మతము మాటయెక్కడున్నది?
దేశద్రోహుల మాటలయందున
మాయ మంత్రము వినుడి, కనుడి.
జీహాదు నేపథ్యమందున
దగాకోరుల ప్రచారాలు.
నేటికైనా భారతీయులు
మేలుకొనుట మేలు యగును.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here