Site icon Sanchika

వారెవ్వా!-2

ఆడవారికి క్షౌరశాలలు బ్యూటీపార్లర్ పేర వెలిసెను
మెడల చుట్టూ జుట్టు వేళ్ళాడంగ ఉయ్యాలూగుచుండే
పాత సంస్కృతి జడలు – సిగలు పాతవారికె పరిమితాలు
రాను రాను ఇంకేమి యగునో రాఘవునికో తెలుసునేమో
నేను మాత్రం భారతీయత భంగపడు టన్యాయ మందును.

పొట్టిగుడ్డలు యువతీమణులను అర్ధనగ్న ప్రదర్శనము
ఒంటి నిండా గుడ్డలాయె యువకులకు యిదియేమి చిత్రమో!
పాశ్చాత్యుల మకిల సంస్కృతి ప్రాచ్యులకు దిక్కాయెనా?
యువత పిచ్చిగ రెచ్చిపోగా నిర్భయోదంతములు బెరిగె.
నేను మాత్రం దేశ సంస్కృతి తెలుసుకొమ్మని నొక్కి చెబుతా!

తేటతేనియ మాటలందున దేశ ప్రజలను ముంచి తీసిరి
ఆశ కసలే హద్దులేదని దోసిళ్ళతో దాచుకొనిరి.
చట్టములు తమ చుట్టమనుచు దేశసంపద కొల్లగొట్టిరి
విదేశాలలో దాచుకొనిరి, స్వదేశాన్నే మరిచిపోయిరి.
తప్పించుకు తిరుగుచుండిరి, వింతరోగాలొచ్చి చచ్చిరి.

Exit mobile version