[dropcap]సా[/dropcap]ధుజీవి గోమాత భువిన
సకల దేవతల నిలయము.
దేవతలు పూజించి మొక్కిరి
ధన్యతను సాధించిరపుడు.
తల్లి కరువగు పిల్లలకు గో
మాత పాలే తల్లిపాలు.
రోగనాశకమైన మందులు,
ఆవు పెరుగున్, వెన్న, నెయ్యి.
అట్టి గోవును హత్య చేయుట
నరకముకు రహదారి యగును.
***
ఔషధము గోమూత్ర మదియే
వరప్రసాదము మానవులకు.
మొండి కాన్సర్, దండి వైరల్
కరొనాను కొరికివేయును.
సూక్ష్మక్రిములను ఆవు పేడ
సమూలముగా పాతరేయును.
గోవు అంగాంగములు యన్నియు
గొప్ప వ్యాధి నిరోధకములు.
అట్టి గోవుకు హాని జేయుట
అహంభావి అసుర చర్యలు.
***
గడ్డి మేసి పాలనిచ్చును,
కామధేనువు బక్క రైతుకు.
పాడిపంటను పెంపుజేయును
పశుల సంపద వృద్ధియగును.
ఆవుతల్లిని నరికివేయుట
ఆవు మాంసము భోంచేయుట
పంచమహాపాతకము సుమ్మా,
ఘోర శిక్షలు యముని ముందు.
పుణ్య భారత భూమిలోన
పాప కార్యము పనికి రాదు.