Site icon Sanchika

వారెవ్వా!-21

[dropcap]దే[/dropcap]శభక్తి యనగ నేమిటని
వాసిగాను తెలియవలెనోయ్.
దేశమే దేహమ్ము కన్న
మిన్న యన్నది గొప్పనోయి.
వోట్ల కోసము కోట్ల ఖర్చులు
ప్రజాస్వామ్యము కాదు భాయి.
కులమతాల కుత్సితాలతో
దేశమే బలహీనమాయె.
దొంగచాటుగ విదేశీయుల
స్వాగతించుట నేరమోయి.

***

విశ్వమందున జనాభాలో
భారతము ద్వితీయామాయె.
కొదవేలేనే లేదు మానవ
వనరులకు మన దేశమందున.
యువశక్తికి ప్రపంచమున
మనమే ముందున్నాము బాబు!
అయిన గానభివృద్ధి చెందుతు
వున్న దేశమె మనది సుమ్మ!
వృద్ధి చెందిన దేశముగ మన
మెందు కెదగలేకపోతిమి?

***

జనాభా, యువశక్తిలో మన
కంటే చిన్నది అమెరికా.
వృద్ధి చెందిన దేశమాయెను
అగ్రరాజ్యము గవతరించె.
అలాగే మరి చిన్న శ్రామిక
దేశములు యభివృద్ధి జెందెను.
జీవనదులకు నిలయమైనా
నిరుద్యోగము, కరువు పెరిగె.
కారణం జన మనములోనే
దేశభక్తి లోపమే గదా!

Exit mobile version