Site icon Sanchika

వారెవ్వా!-22

[dropcap]త[/dropcap]ల్లిభాషలో విద్య నేర్పిన
తరతరాలకు మేలు జేయు.
పాల బుగ్గల పసిడి ప్రాయము
పలుకరించు మాతృభాషన.
ప్రాథమిక పరిజ్ఞానమంతా
పంచిపెట్టును అమ్మభాష.
నేల విడిచిన సాము గదరా,
నమ్ముకున్న పరాయిభాష.
కలసివచ్చును ఇతర భాషలు
కళాశాల విద్యలందున.

***

ఐదు భాషలు విశ్వమందున
అంతర్జాతీయ భాషలు.
అందులోనే ఆంగ్లమొకటై
అలముకున్నది భారతాన్ని.
పిల్లబోయిన గాని ఇంకా
పోలేదిచట పీతి కంపు.
ఆంగ్ల మాధ్యమమ్ముదో ఫ్యాషన్
ఆదర్శము భావదాస్యము.
జపాన్, చైనా, రష్యా లందు
ఆంగ్ల మాధ్యమమే లేదు.

***

ఉన్నవారు ఆంగ్ల మాధ్యమము
నందు చదువ లేదు నష్టం.
వెనకబడితే ఆస్తులున్నవి
వెనుక ముందున బోలెడన్ని.
లేనివాడే వెనుకబడితే
లేనేలేదోయ్ బతుకుబాట.
వృత్తి విద్యా కోర్సులందున
ఉండవలెనోయ్ ఆంగ్ల భాష.
పదో తరగతి దాక మాతృ
భాషా మాధ్యామ ముత్తమం.

Exit mobile version