[dropcap]వి[/dropcap]ద్య లేని మనిషి వింత పశు
వన్నారు విబుధ మణులు.
విద్య నేర్పిన గురువు విమల
దైవమన్నారు సామాన్యులు.
విద్యా దానము గొప్ప దాన
మనియు జెప్పిరి ఋషులు – మునులు.
గురువు సేవలో తరించారు
చరిత కెక్కిన వీరవరులు.
విద్య వ్యాపారమ్ము యగునని
ఎవరి ఊహకు ఎదగలేదు.
***
పచ్చి వ్యాపారాస్త్రమా యెను
ప్రైవేటు పరమైన విద్య.
పెరిగిపోయెను స్వార్థ చింతన
ప్రభుత్వాల అనుమతులతో.
ముక్కు పిండి వసూలు చేసిరి
చిన్న తరగతి పెద్ద ఫీజు.
కార్పోరేట్ కాలేజీలలో
కానరాదు న్యాయ, ధర్మము.
కొల్లగొట్టిరి ప్రచారాలతో
కమీషన్లు గూడ పంచిరి.
***
కళాశాలన, హాస్టలందును
కలవు యెన్నో దోపిడీలు.
పాఠశాల ప్రాంగణమున
పడగ లెత్తెను పాపకృత్యము.
పుస్తకాలు, కాపీలు గూడ
వారె అమ్మిరి ధరలు పెంచి.
ప్రైవేటింజనీరు, మెడికల్
కళాశాలలు అత్యాశలు.
ప్రభుత్వాలకు తెలిసి గూడా
ప్రోత్సహించిరి నేటుగాను.