Site icon Sanchika

వారెవ్వా!-24

[dropcap]వి[/dropcap]శ్వమంత గత్తరొచ్చెను
విచ్చలవిడి విహారించెను.
మానవాళికి శాప మాయెను
మందగమనము మీరిపోయెను.
కరోనా వైరస్‌గ మారెను
కల్లోలము రేపసాగెను.
కొత్త రక్కసి కోరాలల్లో
గుత్తగా ప్రాణాలు బోయె.
మానవుల తప్పిదము కాదా!
ముందు చూపు లేకపోవుట.

***

కప్పలు, పాములు, గబ్బిలాలు
గమ్మత్తుగ ఎలుకలను దినిరి.
ఫలితముగ సరికొత్త రోగము
పల్లవించ కరోనాగా.
ఎదురులేని రాక్షసాయెను
వైద్యమే లేదాయె నేడు.
ఎన్నో లక్షలు పెరిగి రోగులు
క్వారెంటైన్ల కమ్ముకొనిరి.
లక్ష దిశగా సాగుచున్నవి
మృత్యు ఘోషల సంకటాలు.

***

పరగ విరుగుడు మందు కోసం
పరిశోధనలు సాగుచుండె.
ప్రస్తుతం మిగిలింది మనకిక
పరిసరాల పరిశుభ్రత.
పారదోలుట తప్పదాయెను
కరుణ లేని మహమ్మారిని.
ఎవరి ఇంట్లో వారు క్షేమము
గుండవలె విధి తప్పకుండ.
బయట తిరుగుట ప్రమాదమె
వైరసును చంపేయుటకును.

Exit mobile version