Site icon Sanchika

వారెవ్వా!-25

[dropcap]వి[/dropcap]శ్వమంతా విస్తరించెను
కరోనా ప్రమాద నృత్యము.
కల్లోలము రేపి లక్షల
ప్రాణములను పరిహసించెను.
మృత్యువాత పడిన ప్రాణాలే
లక్షదాటి ముందుకెళ్ళెను.
ప్రభుత్వము ప్రకటించె లాక్‌డౌన్
ప్రజలు ఇల్లు దాటరాదని.
కాని హజ్రత్ నిజాం మర్కజ్
మత సభల్లో వేల ప్రజలు.

***

తబ్లిక్ జీహాద్ సభన జేరి
నిబంధననలను నీట ముంచిరి.
ఎవరు అనుమతి నిచ్చినారో
ఈశ్వరునికే తెలుసునేమొ!
కరోనాతో బయటికొచ్చిరి
పరీక్షలంటే పరుగులాయె.
దేశమంతా తిరుగుతూనే
అమాయకుల కాటువేసిరి.
మత వ్యాప్తికి త్యాగమదియన
కాఫీరుల కల్లోలమాయె.

***

పట్టుకుని హాస్పటల్లుంచంగ
వైద్యులపై దాడి జేసిరి.
పోలీసులను పట్టికొట్టిరి
పంతమేదో చెప్పుకుంటిరి.
నాయకుడు మౌలనా పోలీస్
కంట కారము కొట్టిపోయె.
మతము పేర దేశద్రోహుల
నిలయమాయెను భరతభూమి.
లెమ్ము సోదర కనులు తెరువు
అసలు నిజము అర్థమైందా?

Exit mobile version