Site icon Sanchika

వారెవ్వా!-28

[dropcap]క[/dropcap]రోనా దాడులను జూడగ
కఠోర సత్యాలు వెలిగెను.
చిన్న-పెద్ద తేడా లేదని
అన్ని రాజ్యములాక్రమించె.
మారణహోమమ్ము మంటలో
మనుషులను సమిధలుగా జేసె.
తిండిలో క్రమశిక్షణ నుండునని
తెలివిగా చూపించెనిపుడు.
ఆరోగ్యమే మహాభాగ్యమని
అర్థమయ్యేలాగ జెప్పె.

***

అన్ని రంగములందు వృద్ధిని
సాధించిన అగ్రరాజ్యము
అమెరికాలో రెచ్చిపోయెను
ఐరోపాన పెచ్చుమీరె.
రకరకాల జంతుమాంసం
రుచులు మరిగిరి, పచనమాయె.
కప్ప, పాము, గబ్బిలాలతో
ఎలుక మాంసము వదలరైరి.
చైనాలో వైరస్‌గ బుట్టి
ప్రపంచాన్ని చుట్టివేసెను.

***

పేరు పెద్ద, ఊరు దిబ్బయని
పెద్దలెందరో చెప్పినారు.
అగ్రరాజ్యాలైతేనేమి?
అదృశ్య జీవికి హడల్ గద!
క్రమశిక్షణ కత్తిపీటకు
సంపదల గుమ్మడి లోకువ.
ఎయిడ్స్ జృంభణ చూడలేదా
ఎన్ని ప్రాణాలంతమాయె.
శీలసంపద తరిగిపోతే
సర్వస్వము వినాశనమె.

Exit mobile version