[dropcap]స[/dropcap]ముద్రానికి రెండువేల అడుగులెత్తుగ ప్రదేశమ్మది,
దేశ రక్షణ లక్ష్యముగ చలి పులిని సైతం తరిమివేయును
మోకాలు లోతు మంచున మారణాయుధమౌలతో సాగి
సియాచిన్‌లో భరతసేనలు చిత్తములరగ కాపు కాయగ
నేను మాత్రం వీరవరుల పాదధూళిగ పరవశిస్తా.
తల్లిదండ్రుల ముద్దు బిడ్డగ, తనివి దీరగ చదివినాడు
దేశమంటే మట్టి తోడ, మనుషులేయను నిజము దెలిసి
దేహమ్ము కన్న దేశమే మిన్న యన్న త్యాగధనులు
దేశ రక్షణ సైనికులుగ దివ్యముగ ఆదర్శమన
వీరవరులై దేశ సరిహద్దులను గాచె ధీరులకు జై.
భారతమ్మకు సిందూరము కాశ్మీరం కబళించాలని
డెబ్బయ్యేళ్లుగ ధ్వంసరచనకు సృష్టికర్తలు పాకుమూకలు
ఉగ్ర నరసింహులుగ మారి, ఉగ్రవాదము పీక పిసికి
సయ్యాటగ స్థావరాలను మసిగ జేసిన మాన్యవరులకు
నూట ముప్ఫై కోట్ల ప్రజల నిత్య నీరాజనము లందును.