Site icon Sanchika

వారెవ్వా!-31

[dropcap]ఎం[/dropcap]త చెప్పిన కొంత తక్కువ
కరోనా వైరస్ ఫలితము.
అంచనాలను మించి పోయెను
మానవ జీవన విధానము.
లాక్‍డౌనుల అదుపులోనే
లక్షలాదిగా రోగులైరి.
గాలి పురుగదృశ్యమైనా
ప్రాణాలను పరిహరించెను.
బతికినోల్లకు బాధలెన్నో
బ్రహ్మదేవుడె చూడవలెను.

***

న్యాయమందు టాలస్యమైన
అన్యాయముతో సమానం.
కొందరికె సర్కారు సాయం
ఆలస్యము గందె చూడగ.
నెలల కొలదిగ లాకుడౌనున
కొద్ది సాయం లాభమేమి?
వలస కూలి, చిరువ్యాపారి
బతుకు కోలుకోని ఛిద్రము.
రవాణా సరే లేకపోయెను
జీవనము రణరంగమాయెను.

***

వందల వేల కిలోమీటర్లు
దాటి వచ్చిన వారలంత
పొట్టకూటికి పనులు లేవని
దండి ఆకలి కోర్వరైరి.
సొంత వూరికి కుటుంబాలతో
కాలినడకన బయలుదేరిరి.
నిండు ఎండలో మాడిపోయిరి
భార్య పిల్లల రోదనములు.
ఇల్లు చేరేలోగ కొందరు
ఖర్చు ఖాతా కెళ్ళిపోయిరి.

Exit mobile version