Site icon Sanchika

వారెవ్వా!-33

[dropcap]దై[/dropcap]వరూపము దర్శనమునకు
భక్తులందరి కుంది హక్కు.
భక్తిభావన మనసు నందున
ఒక్కటే యన లేదు చిక్కు.
పేదసాదలు, శ్రీమంతులని
ప్రాధాన్యతలు లేనె లేవు.
సామాజిక సామరస్యత
మానవాళికి ధర్మపథము.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ
సర్వదా సమ న్యాయమౌను.

***

కష్టపడి దర్శనము కెళ్తే
కలదు మానసికోల్లాసము.
ధర్మదర్శన మందరికి సమ
భాగమగుట సహజ ధర్మము.
దర్శనానికి టికెట్లంటే
దేవునికి లంచమే యగును.
మెజార్టీల ఆలయాలకే
టికెట్ దర్శన మన్యాయము.
అవినీతిని న్యాయబద్ధము
చేయుతే అపచారమవును.

***

ప్రభుత్వాల ప్రోత్సాహకాలు
హజ్ యాత్రకే సబ్సీడీలు.
మెజార్టీల లంక, నేపాల్
యాత్రకేవి సబ్సీడీలు?
అధిక సంఖ్యాకులుగ బుట్టుట
అపరాధమా దేశమందు?
మతాతీత రాజ్యంగ మందు
మత వివక్ష వోటు బ్యాంకు.
మత వివక్ష యను పదానికి
మతాతీతమొక భాష్యమా?

Exit mobile version