Site icon Sanchika

వారెవ్వా!-34

హిందూ-ముస్లిం భాయి భాయన
హాయి గొలుపును మనసుకెపుడు.
మాటల్లోనే మాధుర్యము
చేతల్లోని చేదు నిజము.
మత మౌఢ్యము వ్యాప్తి జెందెను
చాప కింది నీరై పాయె.
పాలకుల బెదిరించు వర్గము,
మత స్వేచ్ఛను భంగపరిచె.
వొట్ల పేకన జోకరాయెను
కోట్ల కోట్లు కొల్లగొట్టెను.

***

మతమార్పిడి నాశ్రయించిరి
జిమ్మిక్కుల ఆసరాగా.
ఉద్యమముగ మలుచుకొన్నరు
లవ్ జీహాదని పేరు బెట్టి.
ఆడపిల్లల నెత్తుకెళ్ళిరి
నిఖా పేర మతము మార్చిరి.
ప్రేమ పేరున కన్నెపిల్లలను
లోబరుచుకు ఆటలాడిరి.
మగపిల్లల గూడ లాగిరి
మతాంతరీకరణ జేసిరి.

***

వారి సంఖ్యను పెంచుకొనుటకు
వారి వరుస మరిచిపోయిరి.
మత రాజ్యము స్థాపనమ్మును
దారిలోన సాగుచుండిరి.
మెజార్టీల ఉదాసీనతయె
మైనార్టీల వరమ్మాయె.
ధర్మ భారతి యువత వినుడిక!
ధర్మ రక్షణ చేయరండి.

Exit mobile version