[dropcap]భ[/dropcap]వ్యమైనది, దివ్యమైనది కోర్టు తీర్పయోధ్య రామునిది
సమసిపోయెను అధర్మమ్ము, ఐదువందల వత్సరములది
అంధాఅరము లేదు దేవుని పంచలో ఆలస్యమున్నది
దేశ ప్రగతికి దారి పడినదనే ధైర్యము ప్రోదియైనది
కాశి, మధురల వంతు వచ్చెను, కర్మ వీరుల కార్యనిరతికి.
వందలాది గుడుల లోన డెందములర మసీదులున్నవి
మసీదున గుడి ఎక్కడైనా, ఒక్కటైనను కానరాదు.
సర్వమతములు సమానమ్మని రాజ్యాంగము చెప్పుచున్నది
అన్ని మతముల ప్రజలు ఒకటై ఆలోచన చేయ వలెనోయ్
చారిత్రక తప్పిదములను తుడిచివేయుట ధర్మమోయ్.
భారత స్వాతంత్ర్య సమరమ్మందు అందరు దీక్ష జేసిరి
కులమతమ్ముల కతీతమ్మని బలముగా పోరాడినారు.
ఝాన్సీలక్ష్మి సైన్యమందున్ అన్ని మతముల నాదరించిరి
తెల్లదొరల నల్లపాలన తెగే దాకా పోరు సలిపిరి.
స్వేచ్ఛ భారత పాలకమ్మున ద్వేషభావము కూపి రూదిరి.