Site icon Sanchika

వారెవ్వా!-42

[dropcap]స[/dropcap]ర్కారు బడి చదువులేమో
సన్నబడి పోతున్న నిజము.
విద్యార్థులే ఎక్కువైనా
ఉపాధ్యాయులు తక్కువైరి.
ఇంకేదైనా సర్వే యున్న
ఉపాధ్యాయుల ఉరుకులాయె.
ఎలక్షన్లు, జనాభా లెక్కలు
సర్కారు పంతుళ్ళ పనులు.
మధ్యాహ్న భోజనము ఆశలు
తిండియే పాఠమ్ములాయె.

***

పిండి తక్కువ, రొట్టె లెక్కువ,
పిండి కొద్ది రొట్టె కాదిట.
ఉపాధ్యాయులు తక్కువైనా
ప్రశిక్షణలు ఎక్కువాయెన్.
పదో తరగతి పరీక్షల్లో
ఫలిత శాతం పైన చర్య.
అందు కొరకే చూచి రాతలు
పరీక్షల్లో పసందాయె.
సమాధానలే దిద్దు నప్పుడు
చేతికెముక ఉండదాయెన్.

***

ఉపాధ్యాయుల నియామకము
ఉండదాయెను ఏండ్ల కొద్ది.
రిటైర్మెంట్లు మరి చావులేమో
ఆగవాయెను ఎప్పుడైనా.
అడుగు కుండ లేకపోతె
దొంతినెట్ల నిలుపగలరు?
ఎన్ని వున్నా ఏమి లాభం?
ఉపాధ్యాయులు తక్కువైతె!
పాలకుల సద్భావనలతో
బాగుపడు విద్యా వ్యవస్థ.

Exit mobile version