Site icon Sanchika

వారెవ్వా!-43

మహిళకెక్కడ గౌరవమ్మో
దేవతలక్కడ ఉంటారు.
కలకంఠి కంట కన్నీరొలికినా
కలిమి అక్కడ నిలువలేదు.
భారతాన మహిళా జాగృతి
నాటి నుండే పరిఢవిల్లె.
వీరవనితల గన్న దేశము
విశ్వమంతా తెలిసిపోయెను.
మతము పేరున మహిళా హక్కులు
దోచుకొనుట దేశమేగా!

***

పెళ్ళి యనగ నూరేళ్ళ పంట
ఏడేడు జన్మల బంధము.
షరియ తందున తలాకు పద్ధతి
ముస్లిం మహిళకు శాపమే.
నోటి మాతన తలా కంటే
పెళ్ళి బంధము పెటాకులా?
ఆడవాళ్ళ ఉసురు తగిలిన
అంటుకొనును మహాపాపము
శ్రుతి మించిన పురుష స్వేచ్ఛకు
కళ్ళెమేసిన న్యాయ మౌను.

***

ట్రిపుల్ తలాక్ రద్దు చేయుట
ప్రజాస్వామ్యం పటిష్టమే.
స్త్రీల స్వేచ్ఛను స్వాగతించగ
తొలగిపోయెను బంధనాలు.
ప్రజాస్వామ్యము నందు జనాల
మాటకే వోటయె శుభము
మత ఛాందసవాదులకు ఓ
చెంప పెట్టు సమాన మాయె.
ఆలు మొగలకు సమానత్వము
సృష్టికే సింగారమాయె.

Exit mobile version