వారెవ్వా!-44

0
1

[dropcap]ర[/dropcap]చయితల ప్రోత్సాహ పరుచుట
రాజ్యముకే క్షేమకరము.
సాహిత్యము విలువ దెలిసిన
సర్కారుకు వందనమ్ములు.
సాహిత్యము పుస్తకాలలో
నిక్షిప్తము నిజము గాదా!
పుస్తకాలే మస్తకాలను
శుద్ధి జేసి స్ఫూర్తినిచ్చు.
అచ్చు వేసిన పుస్తకాలవి
అమ్ముడవుతే ఆనందము.

***

తెలంగాణ రాష్ట్రమందున
పుస్తకాల కొనుగోలు స్వల్పం.
ప్రభుత్వము కొనుగోలు మాత్రం
పత్రికలకే పరిమితమ్ము.
రచయితల కష్టాల నెవ్వరు
ఆర్చలేరు, తీర్చలేరా?
వేలు, లక్షలు ఖర్చు జేసి
వట్టి చేతులు మిగిలిపాయె.
పుస్తకాలు పంచుడాయెను
లేకపోతే చెదలు బట్టె.

***

టీ.వీ. ఛానెల్ సీరియల్సున
సెల్లు ఫోన్‌ల సొల్లు కబురులు
ఉన్న జ్ఞానం ఊడిపోవును
లేని తెలివి పారిపోయెను.
గ్రంథాలయ సంస్థలన్ని
గంగి గోవుగ మారిపోయెను.
గ్రంథాలయ సెస్సునంతా
ఏమి జేసిరో తెలియదాయె.
వృద్ధ రచయితలకే పెన్షన్
స్కీము యేదీ కానరాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here