వారెవ్వా!-46

0
2

[dropcap]పై[/dropcap]న ముద్దు, లోన గుద్దులట
ప్రభుత్వాసుపత్రి తీరే.
మంత్రులు, అధికార్ల ముందున
అరటిపండు మాటలాయెను.
డాక్టర్ల వ్యవహారములే
యాక్టర్లను మించిపోయెను.
కరోనా పేరు జెప్పుచు కడు
దూరముంచి మాట్లాడ్తరు.
పేషెంట్ల బాధలన్ని వినరు,
తోచినది రాసిస్తూంటరు.

***

గోలీలన్ని లేవంటరు,
బయటనె కొనుక్కోమంటరు.
పరీక్షల పరికరాలేవీ
పనిచేయుట లేదందురు.
అత్యవసరమైన గానీ,
ఇంజక్షన్లు లేవందురు.
ప్రైవేటు ప్రాక్టీసు పైనే
పంచప్రాణములులే వారికి
కరోనా డాక్టర్ల సేవలు
ఖచ్చితముగా బాగుంటవి.

***

ప్రైవేటు దవాఖానల్లు
ఫీజు మోతల వాయింపులు.
ఉన్నదానికి, లేనిదానికి
పరీక్షలాపరేషన్లాయె.
సంపాదన సరిపోదంటూ
కోటీశ్వరులై పోతారు.
మానవత్వము ఎక్కడుందను
అంతరాత్మ పిలుపు వినరు.
ఎంత సంపాదించిన గాని
వెంట ఏం దీసుకెల్తారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here