వారెవ్వా!-53

0
1

[dropcap]దే[/dropcap]శంలో నేటి సామాజిక స్థితిగతులపై తన ఆలోచనలను ‘వారెవ్వా’ అంటూ కవితాత్మకంగా వెల్లడిస్తున్నారు ఐతా చంద్రయ్య.

~

కొనబోతే కొరివి వస్తువులు

అమ్మబోతే అడవి లాగ..

దళారుల దందాల దళములు

జనగణమ్ముల నేడిపించ.

నిమ్నవర్గము కందకుండా

ధరలు ధరపై నిలువలేవు.

అంబరమున చుక్కలై అట

వెక్కిరింతల పాలుజేయ

ఉద్యమాలెన్ని జేసిన

ఏమి లాభం లేకపాయె.

***

భూమి కోసం, భుక్తి కోసం

శక్తినంతా కరగదీసి,

ఆవహించిన అలసటంతా

ఛేదించవు అతుకు బతుకుల్

స్వేద కణములు కాంతిధారలు

కంటిపాపల కప్పగించ

పదవి పెదవులు తడి గ్రోలేడు

నక్క జిత్తుల తాపమణచ

పరిష్కారము చూపు వారికి

ప్రణుతి జేసిన ఫలితముండు.

***

దైవమంటూ, దెయ్యమంటూ

దగాకోరులు రెచ్చిపోగ

మనిషి లోపల మానవత్వము

దానవత్వము కౌగిలించగ

దొరల ముసుగున దొంగలెందరో

దేశ సంపద కొల్లగొట్టగ

కులము, మతము కుత్సితాలకు

రెచ్చగొట్టిన మ్లేచ్చులుండ

సహనమెంతో కాలముండదు

రెచ్చిపోదురు ఖచ్చితముగ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here