Site icon Sanchika

వారెవ్వా!-9

[dropcap]నే[/dropcap]టి సినిమా లెన్ని జూసిన యేమున్నది గర్వకారణం?
సూటిగా కథాబలము మాయము, ఫైటింగులు పాట్లు పెరిగెను.
మేటిగా యువ సంచలనముకు సాధానమ్మొక టాయెను.
మూడు డ్యూయెట్లారు ఫైటులు సినిమాలకు ధ్యేయమాయెను.
కంటనీరు కళాదేవికి, కనెడి వారెవరున్నరయ్యా?

ప్రపంచభాషల్లో తెలుగు సినిమా రాశి పెరిగిపోయెను.
వాసి మాత్రం తరిగిపోయెను వల్లకాడుకు దారిజూపెను.
నటీనటుల సంఖ్య గూడా మేటిగా, సూటిగా పెరిగెను.
సంగీత స్వరము పెరిగెను పాట చెవులకు పారదాయెను.
పాశ్చాత్య వ్యామోహము పరిమళించెను నృత్యమందున్.

నాటి సినిమా పాటవమును పునాదిగ భావించరెందుకు?
మంచి నవలలు, కథలు చదివి సిన్మా కథలుగా తీయరేల?
పాత సినిమా హాల్లు కూల్చగ కొత్త హాల్లను కట్టరెందుకు?
సినీ జనారణ్యమందు మనిషి కేకను వినేదెవ్వరు?
తెలుగు సినిమా తేజము పూర్వోన్నతిని మరి పొందవలెనోయ్.

Exit mobile version