[dropcap]అ[/dropcap]నగనగా ఒక వూళ్ళో రాము, శ్యాము అని యిద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో రాము అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. శ్యాము మాత్రం సహాయం చేస్తే తన దగ్గర దాచుకున్న సొమ్ము అయిపోతుంది అని ఎవరికి సహయపడేవాడు కాదు. ఒకనాడు ఆదివారం సెలవు రోజు కావడంతో పగలంతా స్నేహితులతో ఆడుకుని రాత్రి సమయానికి కథ కోసం తాత గారి దగ్గరకి చేరారు. అపుడు తాతగారు ఒక కథ చెప్పారు.
“ఒక వూళ్ళో ఒక పేదవాడుండేవాడు. అతనికి సంపాదన లేక అందరి దగ్గర భిక్షాటన చేసి కాలం గడిపేవాడు. ఒకరోజు అతనికి ఇలా రోజు భిక్షాటన చేసేందుకు బాధ కలిగి దేవుడ్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడు అతని తపస్సుకు మెచ్చి వరాలు కోరుకొమన్నాడు. అపుడు ఆ పేదవాడు తన ప్రయత్నం ఫలించినందుకు సంతోషించి తనకు ధనము, సుఖసంతోషాలు కావాలని కోరుకుని అవి పొందాడు. దేవుడు ఇంకో వరం కోరుకోమంటే తనకు రోజు విసుక్కోకుండా భిక్ష వేసే రవిశాస్త్రికి కూడా తన లాగానే జీవితం అంతా సరిపోయే ధనము, సుఖసంతోషాలు ప్రసాదించమని కోరుకున్నాడు. దేవుడు సరే అని మాయమయ్యాడు.”
తాతగారు కథలో నీతి ఇలా చెప్పారు: ఎవరైతే ఇతరులుకు సహాయం చేస్తారో దానికి పదిరెట్లు వారికి లభిస్తుంది.
అప్పటినుండి శ్యాము కూడా సహాయం చేయడం మొదలుపెట్టాడు.