[dropcap]గొ[/dropcap]ర్రెపాటి శ్రీను రచించిన ‘వెన్నెల కిరణాలు’ అనే కవితా సంపుటిని పాఠకులకు పరిచయం చేస్తున్నాము.
***
89 వచన కవితల సంపుటి ‘వెన్నెల కిరణాలు’. గొర్రెపాటి శ్రీను సృజించిన కవితలివి.
“వీరి కవిత్వంలో ప్రతి పదం అందంగా ఒదిగి పోతుంది. ఆప్యాయంగా పలకరిస్తుంది. ఆత్మీయంగా వెన్ను తడుతుంది. ప్రేమగా ముద్దాడుతుంది. అగ్నిశిఖలా కన్నెర్ర చేస్తుంది. నిప్పు కణికై హెచ్చరిస్తుంది” అంటారు ‘సిరిమువ్వల గలగలలు గొర్రెపాటి శ్రీను కవితా స్వరాలు’ అన్న ముందుమాటలో డా. వంగిపురపు శారదాదేవి.
***
“గొర్రెపాటి శ్రీను కవిగా తన కలల ప్రపంచాన్ని 89 కవితలలో స్పష్టం చేశాడు” అంటారు వి. శిరీష్ కుమార్ ‘గాఢంగా అనుభవించిన అనుభూతులు’ అన్న పరిచయ వాక్యంలో.
***
“ఉరకలెత్తే గోదావరి పరవళ్ళు తొక్కుతూ సాగుతున్నట్లుగా… పాఠకుల హృదయాలని అలరిస్తూ తన్మయత్వాన్ని కలిగిస్తాయి ఈ కవితలు” అంటారు ‘ఊహల లోగిలిలోకి స్వాగతం’ పలికిన బి. రాంబాబు.
***
‘అమ్మ కోసం’, ‘ప్రతి క్షణం’, ‘శ్రీకారం’, ‘సుమధుర వీక్షణం’, ‘ఆ రోజు’, ‘ఆమె నయనాలు’ వంటి చక్కటి కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి.
***
రచన: గొర్రెపాటి శ్రీను
పేజీలు: 72
వెల: ₹ 100/-
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు
gorrepatisrinu38@gmail.com