వెంటాడే నవ్వు

0
2

[dropcap]ఆ[/dropcap]హా ఎంతటి ప్రశాంతత
ఏమి ఆ చిరునవ్వు
నీ ముసిముసి నవ్వులతోనే
మమ్ము మరిపింపజేతివా
ఏ స్వర్గసీమ చేరుకుంటివయా
నీ జ్ఞాపకాలతో మమ్ము జీవించమంటివా…
నీ మనసు వెన్న… మాట కఠినము
ఎంతటి బాధను అనుభవించితివో కదా…
ఈ అంతులేని సంసార సాగరములో పడి
ఆ నీ బాధను సైతము పట్టించుకోనైతివా
ఓ మహానుభావా!!!

గుండెను పిండించే నీ బాధ
నిన్ను పట్టి పీడిస్తున్నా
చిరునవ్వుతో… ఒక్క చిరునవ్వుతో జయించావు
చెరగని నీ చిరునవ్వుని నీ చివరి
సందేశంగా ఇచ్చావు…

ఏది ఆ కోపము
ఏది ఆ కాఠిన్యము
అంతులేని సుదూర తీరాల
పయనానికి వెళ్ళిపోయావా
నీ జ్ఞాపకాలు మిగిల్చి మాకు…
నీవు మాత్రము ఆహుతి అయ్యావా!!!
ఎన్ని జన్మలెత్తినా నీ చిరునవ్వు
మమ్మల్ని వెంటాడుతునే ఉంటుంది.
…. వెంటాడుతునే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here