విధి వంచితుడు – పుస్తక పరిచయం

    0
    2

    [dropcap style=”circle”]గూ[/dropcap]డూరు గోపాల కృష్ణమూర్తి రచించిన కథల సంపుటి ఇది. మొత్తం 25 కథలున్నాయి ఈ సంపుటిలో. కుటుంబ బంధాలు, సామాజిక అంశాలు, వ్యక్తిగత సమస్యలు వంటి ఇతివృత్తాలతో అల్లిన కథలివి. సమాజంలో వస్తున వింత పోకడలను, తరాల మధ్య అంతరాలను, వాడుకుని పారేసే వైఖరిని ప్రస్తావిస్తూ రాసిన కథలున్నాయి.

    “మానవ జీవితం క్షణకాలంలో విచ్ఛిన్నమైన నీటి బుడగలాంటిది. ఆ క్షణికమైన జీవితంలోనే ఎన్నో అనుభూతులు, భావ మనోవికారాలు, కష్టాలు, కన్నీళ్ళు, సంఘర్షణలు. అటువంటి జీవితంలో కూడా సాహిత్యం మీద అభిరుచి పెంచుకుని, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ ఉత్తమ సాహిత్యం కోసం పరితపిస్తున్న వాళ్ళు కొందరయితే, దాన్నే కాలక్షేపం బఠాణీలుగా భావించి ఆస్వాదించినవాళ్ళు మరికొందరు.. నేను చేస్తున్న ఈ చిన్న సాహిత్య సేవలో నేను సామాజిక సమస్యలకి ప్రాధాన్యం ఇచ్చాను, ఆ సమస్యలకి పరిష్కారం చూపలేకపోయినా ఆవేదనగా నిట్టూర్పు విడిచాను. ఆ సమస్యలకి పరిష్కారం ఏదో ఒకరోజున లభిస్తుందని ఆశాజీవిగా ఆశిస్తూ నేను ఈ కథానికలు, కథలు వ్రాసాను” అన్నారు రచయిత “నా మనవి…”లో.

    ***

    విధి వంచితుడు (కథలు, కథానికల సంపుటి)
    ప్రతులకు:
    గూడూరు గోపాల కృష్ణమూర్తి (రచయిత)
    పాల్ నగర్, 4వ లైన్, ప్లాట్ నెం.95, విజయనగరం-2 సెల్: 7382445284, 08922-231605
    పేజీలు : 194
    వెల :- రూ.100/-

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here