[dropcap]ఎం[/dropcap]తటి వట వృక్షమునకైనా
వేఱు లేక, లేదు ఆ స్థితి.
ఎదిగి ఎలా స్థిరబడుచున్నా-
విద్యాదశయే కల్పించు
ప్రతివానికీ ఆ పరిస్థితి.
మట్టి మాటున…
మనకు కనిపించకున్నా-
వేఱులిచ్చు ఊతము
వృక్షానికి అనంతము.
కాలగమనమున గతమై…
కనుమరుగై పోతున్నా-
విద్యాదశయే ఉద్ధరించు
మనిషి జీవితం.
జీవముగ ఉన్నంత వరకే…
వృక్షము, వేఱుల సంబంధము.
గడించిన పేరుప్రతిష్ఠల
విద్యా సుగంధము…
గిట్టినా మనిషి-
గుబాళించును పరిమళాలు
కలకాలమూ, దిగంతము.