[dropcap]వి[/dropcap].వి. సుబ్రహ్మణ్యం రచించిన చారిత్రక నవల “విద్యారణ్య విజయం”.
***
“విజయనగర సామ్రాజ్యానికి ప్రేరణదాత విద్యారణ్య స్వామి, కాగా విద్యారణ్య స్వామికి ప్రేరణను, ఉత్సాహాన్ని ఇచ్చిన అంశాలు అంతగా వెలుగులోకి రాలేదు. అతి స్వల్ప వ్యవధిలోనే విధర్మీయులను తరిమికొట్టి, వారి మత-విస్తరణ, రాజ్య-విస్తరణల మధ్యన బలమైన బంధాన్ని గ్రహించుకుని, దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మానికి రక్షణఛత్రంగా విజయనగర సామ్రాజ్యం ఏర్పరుచుకోవడం వెనుక ఉన్న నేపథ్యమూ పెద్దగా ప్రచారంలోకి రాలేదు.
విస్తృతమైన నేపథ్యాన్ని విశదీకరిస్తూ, సులభసుందరమైన, పఠనీయమైన శైలిలో ఒక చారిత్రక నవలగా అందించబడుతున్న ఆనాటి చరిత్ర ప్రతి ఒక్కరూ చదవదగినది. తెలుగువారికి నవయుగభారతి సగర్వంగా, సవినయంగా అందిస్తున్న కానుక శ్రీ వి.వి.సుబ్రహ్మణ్యం రచించిన విద్యారణ్య విజయం.
పాఠకులు సులువుగా చదువుకోడానికి వీలుగా ‘నవల’ ప్రక్రియ ననుసరించి ఈ గ్రంథ రచన సాగింది. చారిత్రక నవలకు ఎంతవరకు కల్పన అవసరమో, అనుమతించ దగినదో అంతమాత్రమే కల్పనలకు చోటిస్తూ, చారిత్రక సత్యాలకు దూరం కాని విధంగా శ్రీ సుబ్రహ్మణ్యం ఈ గ్రంథాన్ని రచించారు” అని ప్రకాశకులు పేర్కొన్నారు.
***
“తెలుగుసీమ, దక్షిణాపథం ఒక పెద్ద అగాథానికి గురై, పతనం చెంది, ఆ పతనావస్థ నుంచి కోలుకుని తలెత్తి నిలిచిన చారిత్రక ఘట్టాన్ని ఈ నవలలో చిత్రించే ప్రయత్నం చేశాను.
పోతుగంటి మైలగి నుంచి కంపరాయల వరకు గల ఆదర్శ వీరులపై, నిత్యస్మరణీయులైన సాయన మాధవులపై పాఠకులకు గర్వం, ఆరాధన, ఆత్మీయత కొంతైనా ఈ నవలవల్ల కలిగితే నా ప్రయత్నం ఫలించినట్టే” అన్నారు రచయిత తన “నా మాట”లో.
***
నవయుగ భారతి ప్రచురణల వారు ప్రచురించిన ఈ 300 పేజీల పుస్తకం వెల రూ.200/-. ప్రతులు సాహిత్యనికేటన్, 3-4-852, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాద్ 500027 వద్ద, సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట, ఏలూరు రోడ్, విజయవాడ 520002 వారి వద్ద లభిస్తాయి.