Site icon Sanchika

విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-1

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచర్య అందిస్తున్న సీరిస్]

[dropcap]ఫి[/dropcap]బ్రవరి అంటే కొన్ని రకాల జ్ఞాపకాలు, చెయ్యీ. సాధారణంగా అవి నాకు చిన్నతనంలో పరీక్షల హడావుడి మొదలయ్యే సీజన్ రూపంలో ఎదురైనవి. నేనెటూ పండిత పుత్రుడిని కాదు కనుక పరీక్షలంటే భయం లేదు. మా నాన్న సంస్కృతాంధ్ర పండితులైన సరే! ఆ విధంగా మా నాన్నకు నేను ద్రోహం చేశాను కనుక నన్ను మా వాళ్ళలో చాలామంది దుర్మార్గుడని ముద్ర వేశారు.

ముద్ర వేస్తే వేశారు కానీ, ఆ ముద్రను తీసుకునే వారి శైలిని బట్టీ కదా ముద్ర ప్రభావం వారి మీద చూపేది. కనుక నా దుర్మార్గత్వాన్ని ఇలా మలచుకున్నాను.

దుర్గమమ్ మార్గ చరస్య యస్య సః దుర్మార్గః.

నాకు తెలుగు రాదని ముందే చెప్పేశాను కనుక సంస్కృతం spelling కూడా తెలియదు. So, భావాన్ని తీసుకుని వ్యాకరణాన్ని వదిలేయండి. పైగా కరణీకాలను అన్నగారు రద్దు చేశారు కూడానూ.

ఇంతకీ నా భాషలో దుర్మార్గుడంటే కష్టతరమైనా సరే ఎంచుకున్న మార్గంలో పయనించి విజయం సాధించేవాడు (నేను మేలు కనుక దరుర్మార్గుడు అని రాసుకున్నా. దుర్మార్గవతులు అమేలు లింగంలో వ్రాసుకోండి, let me continue please).

ఇలాంటి ఫిబ్రవరి జ్ఞాపకాలలో ఒకటి మా అమ్మమ్మ పుట్టిన రోజు ఒకటి. ఆవిడ పేరు మీకందరికా తెలిసే ఉంటుంది. ఆవిడ పుస్తకాలు చేతులతో పట్టుకుని మరీ చదివే ఉంటారు. 2 ఫిబ్రవరి నాడు జన్మించిన ఆమె రెండు ఉద్గ్రంధాలు రాసింది. వాటిని చదవని లిటరరీ అభిమాని ఉండరు. ఇవి పోతే మూడు నాలుగు బాధాకర జ్ఞాపకాలు. మా మురళీబాబు, ఒక నిజం అమ్మమ్మ (I mean not in spirit), ఒక మేనత్త, ఒక మిత్రుడు, మా రంగబాబు, ఇలా కొన్ని మరణాలు. వీటిలో నన్ను దెబ్బకొట్టినవి మురళీబాబు, నిజం అమ్మమ్మ పరమపదించటం. అలా నన్ను కదిలించేసి, వేధించబోయే మరో మరణం ఫిబ్రవరిలోనే ఎదురవటం!!!

😰.

ఎందుకీ కక్ష?

చిన్నప్పుడు పరీక్షల టైమ్ నీతోనే మొదలని ఎంత ప్రేమించాను? ఉద్యోగమప్పుడు నువ్వైతే 28 రోజులకే వెళ్ళిపోయి జీతం తెప్పిస్తావని ఎంత ఆరాధించాను?

ఆఖరుకు కే. విశ్వనాథ్ ను కూడా నీ పొట్టన పెట్టుకున్నావు? అది కూడా Ayn అమ్మమ్మ పుట్టినరోజునే! ఘోరం girl. I hate you. But I have been trying to remove hatred from my system. But I may not celebrate Ayn Rand’s birthday with the same verve.

🤦🏻!

పదిహేనేళ్ళ క్రితం

ఆరోజు పని ఎగ్గొట్టి ఇంట్లో కూచున్నాను. పన్లేని నేను టీవీ చూసినట్టు, టీవీ పెట్టాను. ఇంతలో లోకల్ ఛానల్‌లో కే విశ్వనాధ్ ‘స్వాతి కిరణం’ వస్తోంది. చూస్తుండగా నాకొక ఐడియా వచ్చింది.

ఒక ఐడియా నా షెడ్యూల్‌నే మార్చేసింది. అందుకే నెట్ సెంటర్‌కి వచ్చి టైపింగ్ మొదలు పెట్టాను.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. చాలా కాలం నుంచీ నేను విశ్వనాథ్ సినిమాలు చూస్తున్నాను. అందులో నాకు ఎందుకో నాలుగు సినిమాలు చాలా నచ్చాయి. విశ్వనాధ్ సినిమాలు నచ్చటం చాలా మామూలు విషయం. కేబుల్ హేటర్లకు తప్పిస్తే!

 

కాక పోతే ఈ నాలుగు సినిమాలూ నచ్చటం మాత్రం కొంచం స్పెషలే. నేను ఆ సినిమాలని ఎన్ని సార్లు చూశానో చెప్పలేను. అంత నచ్చాయా అని కాదు. (నాకు నచ్చాయనుకోండి). ఆ సీన్‌లు, కొంచం ఈ సీన్‌లు, పూర్తిగా కొంచం, అసంపూర్తిగా ఇంకొంచెం. ఇలా నేను ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు. Modern Classics అవి.

ఇంతకీ ఆ సినిమాల స్పెషల్ ఏంటంటే.. అవి సామాజిక సమస్యలనో.. రాజకీయ సమస్యలనో.. టార్గెట్ చేసుకుని తీసినవి కాదు. వాటిల్లో వ్యక్తిగతమైన ఒకరకమైన ఫీల్ ఉంది. వాటిని చూస్తుంటే నాకు Ayn Rand నవలలే గుర్తుకు వస్తుంటాయి. ఇదెక్కడి పోలిక అనొద్దు. ఎందుకో నేను వివరిస్తాను. మీరే చూద్దురు.

ఈ సినిమాల్లో ఆయన నాలుగు రకాలైన గురువులని చూపించాడు. మీకు Ayn Rand వ్రాసిన THE FOUNTAINHEAD తెలుసా? తెలీకుండా మేము పుస్తక ప్రేమికులం అనవద్దు. చదవకుండా నేను వేదాంతిని అనకండి. వింటేనే విరక్తి పుడుతుంది. మన మేధావులు చేయించిన Atlas Shrugged Telugu translation మాదిరి.

అందులో ఆవిడ నాలుగు రకాలైన మనుషుల వ్యక్తిత్వాలూ.. వారి జీవన గమనాల్నీ.. వారి మనస్తత్వాలనీ.. వారి మానసిక సంతృప్తులనీ.. అసంతృప్తులనీ.. ఎంతో విశదంగా వ్రాసింది. అందుకే ఆ నవలని Modern Classic అంటారు అభిమానులు. విచిత్రమేమంటే.. Ayn Rand నవలలని ఇష్టపడే వారూ, ఇష్టపడని వారూ తప్ప మధ్య వర్గం వారు లేకపోవడం.

సరే! ఆ సినిమాలు ఏవంటే..

  1. “శంకరాభరణం”
  2. “సాగర సంగమం”
  3. “స్వర్ణ కమలం”
  4. “స్వాతి కిరణం”

Ayn Rand మనుషుల్లో వ్యక్తిత్వాలని ఆరోహణ క్రమంలో చెపితే.. కే విశ్వనాధ్ అవరోహణ క్రమంలో చూపారు గురువులను. దిగజారిపోతున్న ఈనాటి విలువల లాగా.

అదెలాగో నేను మీకు చెపుతాను.

“విజయ విశ్వనాథం!”

ఈ ప్రయత్నాన్ని నేను “నేను చెయ్యగలను” అనే నమ్మకంతో ఒకవైపూ.. చేయగలనా అనే అపనమ్మకంతో ఒక వైపూ.. ప్రారంభించాను అప్పటిలో. అదే.. పదిహేనేళ్ళ క్రితం. అయినా నోట్స్ రాసుకుంటూ పరిశోధనాత్మక వ్యాసాలుగా మలచాను.

అయినా సాధిస్తే విజయం నాకే.. సాధించలేక పోతే ఆ అనుభవం నాకే..

నాది ఒక ప్రయత్నం మాత్రమే. సిన్సియర్ గా వ్రాయటమే నా విధి. ఫలితం భగవంతుని చేతుల్లో.

ఏదేమైనా నా పంథా..

“సత్యమేవ జయతే!”

ఇక చదవండి!

~

శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa?

నేను “స్వాతి కిరణం” సినిమాని ఒక ఖాళీ రోజున చూస్తుండగా నాకు కలిగిన ఆలోచన ఈ సినిమా గురించి నా అభిప్రాయాలని, ఈ సినిమాకు (electronic cinema కాదు) Ayn Rand వ్రాసిన The Fountainhead కు ఉన్న సంబంధం గురించి పంచుకుంటున్నా కదా.

పదిహేనేళ్ళ క్రితం నెట్టుకి వచ్చి (ఎవరినీ నెట్టుకుని అని కాదు. Internet Centre కు అని. అవతార్ నాటికి డైపర్లలో ఉన్న జాతికి: అప్పట్లో ఇంటర్నెట్ కావాలంటే ఊళ్ళోకి వెళ్ళి నెట్ కెఫేలను వెతుక్కుని గంటకు ఇంత అని కట్టాలి. అలాంటి స్టోనేజ్ కాలమది. Yea! Yea! I’m an antique piece) వ్రాద్దును కదా.. ఎప్పటి నుంచో నన్ను తొలుస్తున్న కాన్సెప్ట్, బయటకి వచ్చింది. అందుకే ఒక కేస్ స్టడీగా గురువుల గురించి విశ్వనాథ సినిమాల్లో ఉన్న విషయాన్ని తీసుకుందామని అనిపించింది.

దీనికి Ayn Rand వ్రాసిన THE FOUNTAINHEAD కోణం లోనుంచీ చూస్తే కలిగిన ఆలోచన గురించి పైనే చెప్పాను.

నాకు కే విశ్వనాథ పరిచయం అయింది “స్వాతి కిరణం” సినిమాతో. అప్పటికి నేను చాలా చిన్నవాడిని. ఆ సినిమా నన్నెంతో ఆకట్టుకుంది. అది సంగీతం మీద మక్కువ తోనో, లేక కళాకృతుల మీద అభిమానం తోనో కాదు. అంతకు ముందే నేను “ఖైదీ” చూశాను. సినిమా నచ్చినా నాకెందుకో అందులోని కాన్సెప్ట్ నచ్చలేదు. సినిమా అంటే ఫైటింగేనా? అనుకునే వాడిని. ఆ సమయంలో నేను “స్వాతి కిరణం” చూశాను. నా చిన్ని మనసుకెందుకో ఆ పాటలూ, ఆ నటన లోని సహజత్వం, కంపు హాస్యం చూసిన నాకు ‘గాయట్రీ వషన్టం’ జోకులూ తమాషాగా అనిపించాయి.

ఆ తరువాత దాదాపు దశాబ్దం తరువాత నేను మా Ayn అమ్మమ్మ వ్రాసిన THE FOUNTAIN-HEAD చదివాను. అది చదువుతుంటే నాకు ఎందుకో విచిత్రంగా కే. విశ్వనాథ సినిమాలే గుర్తుకు వచ్చేవి. కొన్ని సార్లు నాకు ఈ విషయాన్ని మాటలలో పెట్టాలని అనిపించేది.

అది ఇలా ఆరోజున ఇలా బయటకి వచ్చింది.

పై (not 3.141592653…) శీర్షిక “శంకర శాస్త్రి ఆంధ్రా Roarkaa?” చూశారా?

ఎవరైనా FOUNTAINHEAD చదివిన వారికి అందులో హీరో HOWARD ROARK ఆత్మాభిమానం గురించి తెలిసే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన లక్ష్యమే తప్ప అన్యమైన విషయాల మీద దృష్టి ఉండదు. ఎవరు ఎలా మారినా తన మీద తనకున్న నమ్మకం తో ఏ పరిస్థితుల్లోనైనా రాజీ పడడు. అంతగా ఐతే తన వృత్తిని వదిలేసి రాళ్ళు కొట్టైనా బ్రతుకుతాడేమో కానీ తన విలువలని మాత్రం వదులుకోదు.

మరి మన ‘శంకర శాస్త్రి’? ఆయనా అంతే. తన సంగీతాన్ని జనం ఆదరించక పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా తను నమ్మిన విలువల కోసమే కట్టుపడ్డాడు. అసలు ‘బ్రోచే వాడెవరురా’ ని ఒహండు ఖూనీ చేస్తున్నప్పుడు ఆయన పడ్డ వేదనని చాలా సినిమాల్లో పేరడీ క్రింద వాడారు. అలాగే తన కూతురు తప్పుగా పాడే సందర్భంలోనూ తనకు ప్రాణాతి ప్రాణమైన సంగీతాన్ని గురించే ఆయన ఆలోచన కానీ అన్యం కాదు. ఈ సన్నివేశాన్నీ మన సినీ దుండగులు పేరడీ చేశారు.

శ్శార్ర్ఱధా!

ఆ మాదిరే వేశ్య అయిన ఒక తెఱవను (= మహిళ) ఆదరించే సమయం లో తన విలువలకి కట్టుబడ్డాడే కానీ ఎవరో ఏదో అనుకుంటారనే విషయాన్నే ఆయన పట్టించుకోడు.

సరే. ఇంతటితో ఇక్కడికి ముగిస్తున్నాను. అసలు విషయాన్ని ముందు ముందు చూద్దాం.

కే విశ్వనాథుడు దివికేగటం గురించి విన్న తరువాత నేను eye-diapers కోసం వెతుకుతున్నాను. అలా ఉంది పరిస్థితి.

ఒక్క విషయం. Ayn Rand రచించిన THE FOUNTAINHEAD ని శంకరాభరణంతో పోల్చటం నా లక్ష్యం కాదు. కొన్ని సారూప్యాలని మాత్రం ఎత్తి చూపడం. నా ప్రధాన లక్ష్యం పైన తెలిపిన కేస్ స్టడీ.

శంకర శాస్త్రి శంకర శాశ్త్రే. Roark Roarke.

నా దృష్టిలో ‘శంకర శాస్త్రి’ is the Greatest Heroic character in the Telugu Cinemas. ఆ సమయం అలాంటిది. ఆ దర్శకుని గొప్పతనం అలాంటిది. అదెలాగో తెలుసుకోవాలంటే ‘విజయ విశ్వనాథం’ చదవండి.

గమనిక: ఈ వ్యాసం మాత్రం కేవలం ఒక పీఠిక లాంటిది. మన సంచిక ప్రకటన అని కూడా అనుకోండి.

శీర్షికలో ఆంగ్లాన్ని వాడాను. అది తప్పనిసరి అని నా అభిప్రాయం. ఎందుకంటే… Roark ని ఎవరు ఎలా పలుకుతారో తెలీదు. అందుకే ఆంగ్లం లోనే వదిలేస్తే బాగుంటుందని ఇలా చేశాను.

Exit mobile version