విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-10

0
2

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

The Egoist

[dropcap]W[/dropcap]hen she was asked to define her philosophy in a single statement, Ayn Rand came up with this gem.

<<My philosophy, in essence, is the concept of man as a heroic being, with his own happiness as the moral purpose of his life, with productive achievement as his noblest activity, and reason as his only absolute>>

—> The concept of man as a heroic being

—> Own happiness as the moral purpose

—> Productive achievement as noblest activity

—> reason as only absolute

స్థూలంగా చూసినా, సూక్ష్మంగా చూసినా, ఐన్ ర్యాండ్ చెప్పిన ఆదర్శ మానవుడి జీవన విధానం. సాధన అన్నది గట్టిగా చెప్పబడిన విషయం. తన సంతోషమే తన బాధ్యత.

ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.

మనకు రెండు పదాలున్నాయి.

—> Egoist

—> Egotist

రెండిటినీ చాలామంది సమానార్థకాలుగా వాడుతుంటారు. దాదాపు ఒకే పదంలా. ఇంకొంతమందైతే ఈ పదాలను బూతులా చూస్తారు.

Egoist, egoism, ego.. ఇవన్నీ సమాజంలో సాధారణంగా negative sense లో మాట్లాడుతుంటారు. కానీ ఇవన్నీ చాలా పాజిటివ్ పదాలు. ఈమధ్యకాలంలో ఇంకో రకం తయారయ్యారు.

Ma lyf ma rules batch.

వీళ్ళు ఇగోయిస్టులు కారు. ఇగోటిస్టులు కారు. These are vain batch. TikTok లో వగలు పోయి attention కోసం అర్రులుజాస్తూ, జనాలు ఓ విధంగా చూస్తున్నా అది కూడా మా గొప్ప అనుకునే రకాలు.

This is Vanity Fair.

చులాగ్గా చెప్పాలంటే

Egoist: I am because I am.

Egotist: I am because you’re not.

అర్థమయ్యిందా?

తనకన్నా ఎవరన్నా గొప్పవారు కనిపిస్తే వారితో సరైన రీతిలో స్పర్థ వహించి, తాము ఎదగటం ద్వారా, తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవటం ద్వారా వారిని అధిగమింపబూనే వారు.

మరి అనంతరామ శర్మ ఇలా లేడు కదా. గంగాధరం తనకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు అని తెలియగానే ఈయన ముడుచుకుని పోయాడు. కుంగిపోయాడు.

అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు చాలు. గంగాధరం సంగీత పరిజ్ఞానం తెలియటానికి అనంతరామ శర్మకు కేవలం మూడు పాదాలు సరిపోయింది. స్వర మాధుర్యం ఎత్తుగడలోనే అర్థమయింది.

చాలా disturb అయ్యాడు. అందుకే గంగాధరం పిల్లచేష్టను అంత కఠినంగా ఖండించాడు. Had he been an ideal man as Rand defined, he would have brushed it off as a creative lapse or indulgence of a boy or took it seriously and explained to him the nuances. కానీ, తను చేసిన పనిని అనుకరించినందుకు అతన్ని..

అక్కడే అనంతరామ శర్మ అభద్రతా భావం బైట పడింది.

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇంకో కీలకమైన విషయం ఉంది.

Apparently Anantha Rama Sharma may appear like Peter Keating. But he’s not untalented like Keating. Keating లక్షణాలను ఆయన కలిగి ఉన్నాడు. కానీ, కీటింగ్ లాగా అసలేమాత్రం సామర్థ్యం లేని వాడు కాదు. లేకపోతే అంత తక్కువ సమయంలో కేవలం 48 క్షణాలలో గంగాధరం తన ఉనికికే ప్రమాదం అని తెలుసుకోలేడు. అందులోనూ ఎంతో గొప్ప సంగీత జ్ఞానం లేనిదే అంత గట్టిగా ఆ పిల్లవాడిని గురించి అంత అంచనా (సరిగ్గా) వేయలేడు.

గంగాధరం ముందు తగ్గి ఉండవచ్చు కానీ, ఆయన కూడా అపర సంగీత సరస్వతి.

మరి ఎక్కడ తేడా పడింది?

ఇప్పుడు మీకో ప్రశ్న రావాలి.

భవదీయుడు మొదట్లో అనంతరామ శర్మ ఓట్రించి అడిగినప్పుడు ఆయన పీటర్ కీటింగ్ అని చెప్పాడు. మరి ఇప్పుడు కాదంటున్నాడు. ఇంతకీ ఏది నిజం?

ఇక్కడ నిజానికన్నా సత్యానికి ప్రాధాన్యం ఇద్దాం.

అంటే వియయాన్ని చాలా సూక్ష్మ స్థాయిలో పరిశీలించి చూడాలి. అప్పుడే అనంతరామ శర్మ పతనానికి హేతువులు అర్థమవుతాయి.

దీనికి అష్టావక్ర మహర్షి కథ కూడా మనకు ఒక fulcrum లాగా ఉపయోగ పడుతుంది.

దృశ్యం పరంగా పురుషసూక్తం సన్నివేశం నుంచీ ఆనతినీయరా, హరా! వైపు మనం ప్రయాణం సాగించాలి.

ఆ పాటలో అక్షరమక్షరం పరిశీలించాలి.

విశ్వనాథ్ విజన్, దర్శకత్వ ప్రతిభలను మనకు పూర్తిగా అవగతం చేసే ఒకానొక అద్భుతమైన సన్నివేశమది. సీతారామ శాస్త్రి యొక్క ప్రతిభను అమరం చేసిన గొప్ప సందర్భమది.

నటుడిగా మమ్ముట్టి శిఖరాయమానమైన ప్రతిభను చాటిన సమయమది. పోల్చదగినది ఎందరో మహానుభావులు పాడుతున్నప్పుడు నాగయ్య గారు చూపిన నట విశ్వరూపానికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఆ మలయాళ నటుడు చెలరేగిపోయిన దృశ్యం.

ఇక సంగీత దర్శకుల గురించి చెప్పాల్సిన పని ఏముంది?

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here