[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]
స్వరాపస్వరం
[dropcap]వే[/dropcap]ద మంత్రోచ్చారణలో నాలుగు రకాల స్వరాలను ఉపయోగిస్తాము.
- ఉదాత్త ఉదాత్త్ (మధ్య స్వరం)
- అనుదాత్త అనుదాత్త్ (తక్కువ స్వరం)
- స్వరిత స్వరిత (అధిక స్వరం)
- దీర్ఘ స్వరిత ధీర్ఘస్వరితం (అధిక స్వరం).
ఇవి సాధారణంగా స్వర గుర్తులతో గుర్తించబడతాయి – తక్కువ స్వరం కోసం అండర్లైన్ (__), అధిక స్వరం కోసం అక్షరం పైన ఒక చిన్న నిలువు గీత (।) మరియు దీర్ఘ స్వరిత కోసం రెండు నిలువు గీతలు (॥). మధ్య స్వరానికి ఏ గుర్తూ వాడరు.
చర్వితచరణం కానీ తప్పదు.
చాలా చాలా (please don’t remember Sekhar Kammula dialogue) ప్రాచీన కాలంలో ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ కాలానికి తగిన రీతితోనే ఆయన విద్యనభ్యసించి బ్రహ్మచర్యాశ్రమాన్ని విజయవంతంగా దాటాడు. ఆపైన గృహస్థాశ్రమం స్వీకరించాడు. ఆయనకు కాస్త కోపం ఎక్కువ. తప్పేమీ లేదు.
ఆయన వేద పారాయణం, నిత్యాగ్నిహోత్రం మొదలైనవి చేస్తూ ఉండేవాడు. శ్రద్ధతో పాటు సహజ పాండిత్యం కలిగిన వాడు కనుక, తను చేస్తున్న పనిలో నిష్ణాతుడు కనుక, దానికి తోడు తపస్వి కనుక అతని దగ్గర చాలామంది శిష్యరికం చేసేవారు. అలా చాలా పెద్ద శిష్యగణం పోగుపడింది.
ఆయన తపోనిరతుడు. దానితోపాటూ విపరీతమైన శ్రమ చేసేవాడు. అందుకు తగ్గట్టుగానే విశ్రాంతి అనే మాట లేకుండా వారి శిష్యుల చేత కూడా శ్రమ చేయించేవాడు. ఆయన భార్య పేరు సుజాత. ఆమె ఉత్తమురాలు. దొడ్డ ఇల్లాలు. భర్తకెన్నో ఉపచారములు చేసేది.
కాలక్రమంలో ఆమె గర్భవతి అయింది.
ఇక్కడ కథనాన్ని మారుద్దాం.
ఇంతకు ముందు Ego Clash between father and the unborn son అన్న రీతిన కథ సాగింది. ఇప్పుడు దీన్ని వేరే విధంగా చూద్దాం.
ఇక్కడ ప్రధాన అంశం మహాత్ముడైన అష్టావక్ర మహర్షి ఎందుకు అలా శారీరక లోపంతో పుట్టాడు? అన్నది.
దానికి తండ్రి ఇచ్చిన శాపం కారణం అన్నది పౌరాణిక కథనం. కానీ ఆ శాపాలు, మేజిక్కులు, మన సంప్రదాయ కథనాలు నచ్చని హై ఐక్యూ వారికి అవన్నీ ఉపసంహరించి ఏవో లాజిక్కులతో ఉదాత్తమైన, ఔన్నత్యంతో కూడిన వ్యక్తుల జీవిత కథనాలను నేల మీదకు దించి రాయటం అలవాటేగా.
పర్వ!
జయం!
మెలూహాలు!
వాటి విలువ వాటిదే. కాదని అనలేం. కాదన కూడదు. రెండు రకాల పరిశీలనలూ ఉండాలి. కానీ, ఈమధ్య ఇలాంటి వాటివల్ల అసలే నిస్సారమైపోతున్న మన post-pandemic జీవితాలలో మిగిలి కాస్త మేజిక్ కూడా extinct అవుతోంది.
ఇప్పుడు అసలు కథ, దాని వల్ల వచ్చిన నష్టం చూద్దాం.
BOSTON అగ్నిహోత్రావధాని: అన్నీ సైన్సులోనే ఉన్నాయిష!
అష్టావక్రుడికి గర్భంలో ఉండగానే వేదాలను గురించిన జ్ఞానం వచ్చిందా లేదా అన్నది చెప్పలేము.
ఏకపాదుని దగ్గర కనీసం 1000 మంది శిష్యులు ఉండి ఉండవచ్చు. వారందరూ ఆయన అపస్వరంతో చెప్పిన వేద పాఠాన్ని పలుమార్లు (నీ పిశాచపు గట్ట అనవద్దు) తప్పుగా వల్లెవేస్తారు.
కానీ, సైన్సు అష్టావక్ర మహర్షి గర్భంలో నుంచి తండ్రిని తప్పు పట్టలేడు. కనుక ఇలా జరుగుతుంది.
పెద్ద శబ్దాలకు, డీజే ప్రోగ్రాములకు దూరంగా ఉండమని గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు చెప్తారు. Mainstream medical doctors. మరి అంత పెద్ద స్వరాలతో ఆ విద్యార్థులు పలుకుతున్న అపస్వరాలు హాని చేయకుండా ఉంటాయా?
వేయి మంది విద్యార్థులు. వేయి రకాల ఫ్రీక్వెన్సీలు. బీట్స్ ఫామ్ అవుతాయి. ఇంటర్ఫెరెన్స్ జరుగవచ్చు. అందులో constructive & destructive అనే రకాలుంటాయి. వాటి ప్రభావం గర్భస్థ శిశువు మీద కచ్చితంగా పడే ఉంటుంది. రూపు దాల్చినాక కనీసం ఎనిమిది నెలల కాలం ఆ అపస్వరాలు విని ఉండాలి. శిశువు deform కాకూడదని రూలేమీ లేదుగా. అందుకే అష్టావక్ర మహర్షి అలా పుట్టాడు.
ఇక్కడ తండ్రీ బిడ్డల Ego Clash లేదు. దాంతో తండ్రి శపించే పని పడలేదు.
అది వదిలేస్తే there’s no clash between Ekapādās egotism (in some way we can say it’s his vanity) and Ashtavakra’s egoism. ఇక ఇక్కడ విక్టిమ్ తప్ప Sanction of the Victim అన్నది లేదు. దాంతో there’s no example of antidote to Gangadharan and Anantha Rama Sharma situation.
There’s no medicine to cure egotism and antidote to Sanction of the Victim.
ఈ కథలో మేజిక్ తీసేస్తే మట్టే మిగిలింది.
పైగా మరొక డౌట్. అన్ని నెలలు వేదాన్ని తప్పుకా ఉచ్చరిస్తే మిగిలిన జనాలు ఎలా ఊరుకుని ఉంటారు? కనుక… అన్నీ సైన్సులోనే ఉన్నాయిష!
నీతి: For every అన్నీ వేదాలలోనే ఉన్నాయిష! There always exists అన్నీ సైన్సులోనే ఉన్నాయిష!
దీన్నిబట్టీ చూస్తే అనంతరామ శర్మ చేయబోయింది దాదాపు భ్రూణహత్యతో సమానం. వేద మంత్రాన్ని తన egotism తో vanity to అపస్వరాలతో పాడాడు. అంతే కాదు. తనను ఆదర్శంగా తీసుకునే వారు కూడా తప్పు మార్గంలో పోయేలాగా ఆదర్శంగా నిలిచాడు.
గంగాధరం తప్పు చేయటానికి కారణం ఆయనే.
అనంతరామ శర్మలో ఉన్న ఈ తేడాను పసిగట్టింది, ఇతరులను alert చేయబూనింది కేవలం ఒక్కరే! అదెవరో..
(కలుద్దాం)