Site icon Sanchika

విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-18

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

నిరహం

[dropcap]A[/dropcap]yn Rand’s Objectivism dispels many myths about Ego, and properly differentiates between Egoism and Egotism.

Simply put:

Egoism – I am because I am.

Egotism – I am because you’re not.

To cut short to the point we need here, is a philosophy that emphasizes the individuals and their rights and rejects the idea of selflessness.

నిరహంకారం. చాలా ప్రమాదకరం. Selflessness is idolised in many philosophies and cultures. But the true nature of selflessness is not understood properly by many. It is very essential to understand selflessness in order to beat a jealous person when we’re fighting one such.

ఐన్ ర్యాండ్ ప్రకారం Selfishness అనేది మానవులకు ఒక వరం. దాన్ని స్వార్థం అనే అర్థంలో తీసుకోకూడదు.

నిన్ను నీవు ఎరుగుట. దానికి తగిన రీతిలో నీకు నీవు మేలు చేసుకొనుట. ఇదీ మనం selfishness గురించి అర్థం చేసుకోవాల్సిన పద్ధతి.

అహానికి (అహం), అహంకారానికి తేడాను కూడా ఇదే విధంగా మనం అవగాహన చేసుకోగలగాలి. నేను ఇదీ అని మనం తెలుసుకుని, అందుకు తగినట్లు ఉండగలగటానికి మానవులకు పనికి వచ్చే tool అహం. నేను అనే భావన. నేను మాత్రమే అని భ్రమ కలిగించేది అహంకారం.

అహం ఉన్న వ్యక్తికి అసూయ ఉండదు. లేదా అలాంటి వ్యక్తులు అసూయను జయిస్తారు. కారణం వారేంటో వారికి తెలిసి ఉండటం. తానేంటో తాను ఎరిగిన వ్యక్తి, తన తాహతును మించి ఆలోచించడు. కనుక అసూయకు ఆస్కారం అత్యల్పం.

నిరహం అనేది ఒక వ్యక్తిని తనను తాను ఎరుగకుండా చేస్తుంది. Peter Keating was a man who couldn’t and didn’t know it. తానేమిటో తాను ఎరుగడు. కనీసం తానేమిటో తాను ఎరుగడు అని కూడా తాను ఎరుగడు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి!

గంగాధరం మీద అసూయ మొదలయ్యాక అనంతరామ శర్మ అసలు తను ఏమిటో తానే మర్చిపోయాడు.

ప్రణతి ప్రణతి ప్రణతి పాటకు సంగీతాన్ని సమకూర్చే సమయంలో ఆయన ఇచ్చిన ట్యూన్, ఆ పాడే విధానంలో అభద్రతా భావం. దానిని కప్పిపుచ్చుకునేందుకు వేసుకునే అహంకారపు ముసుగు స్పష్టంగా కనుపిస్తాయి. ఆఖరకు

ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే

అని నమస్కారం చేసేది కూడా ఒక false humbleness. లేదా నేను కనుక ఈ పని చేస్తున్నాను అనే అహంకారం.

ఇదే selflessness. Not knowing or willingly suppressing the self. నిరహం.

తన పుస్తకం The Virtue of Selfishness లో, selfishness యొక్క సాంప్రదాయిక నిర్వచనం తప్పు అని Rand తెలియజెప్పింది. ఆమె selfishness ను ఇలా నిర్వచించింది “the concern with one’s own interests.” ఇది సహజమైన మరియు ఆరోగ్యకరమైన మానసిక స్థితి అని, దీనివల్ల మాత్రమే అన్నివిధాలైన మానవ పురోగతి సాధ్యమని చెప్పింది. మానవాభ్యుదయానికి ఇదే పునాది అని అన్నది ర్యాండ్.

పరోపకారం లేదా ఇతరుల కోసం తన స్వంత ప్రయోజనాలను త్యాగం చేయాలనే నమ్మకం విధ్వంసక శక్తి అని రాండ్ తెలిపింది. Rand argues that altruism, or the belief that one should sacrifice one’s own interests for the sake of others, is a destructive force. She argues that altruism leads to resentment, guilt, and a loss of self-esteem. She also argues that altruism leads to a society where people are not free to pursue their own happiness.

ఈ ఫిలాసఫీని అనైతికమని, ప్రమాదకరమని చాలామంది వాదించారు. Objectivism ను Academic లెవెల్ లో అంగీకరించలేదు. కొద్దిమంది మటుకూ Objectivism మానవ పురోగతికి హేతువుని అర్థం చేసుకుని అంగీకరించారు.

The only moral purpose of a man’s life is the pursuit of his own happiness.

అల్టిమేట్‌గా ఎవరైనా కోరుకొనేది అదే. కానీ అంగీకరించరు. ఇప్పుడు, ఈరోజుల్లో ఈ నిరహం అనేది wokefulness గా రూపాంతరం చెందుతోంది. ఈ wokeness అనేది గతంలో వచ్చిన కమ్యూనిజమ్, సోషలిజమ్ వేసిన వెర్రితలలకన్నా ప్రమాదకరంగా మారుతోంది. కానీ ఇది ఇక్కడి సబ్జక్ట్ పరిధి మించినది కనుక మనం నిరహం గురించి మాట్లాడుకుందాం మరింత వివరంగా. One step at a time.

(కలుద్దాం)

Exit mobile version