Site icon Sanchika

విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-20

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

త్యాగరాజ కృతిలో Breakdance

[dropcap]ఒ[/dropcap]కవంక గంగాధరాన్ని చూస్తుంటే Ayn Rand చెప్పిన Prime Mover లా అనిపిస్తుంటాడు. సృష్టికర్త. అంటే ఆ విరించి కాదు. ఇలలో. మనలో. ఒకరకమైన రసానుభూతిని సృష్టించి మధురమైన అనుభవాలను అందించగల ప్రతిభ ఉన్నవాడు.

మరొకవంక అతని చేష్టలు తన వయసుకు తగ్గట్లు ఉంటాయి. తన స్నేహితులకు రాసే ఉత్తరాలలో భాష విషయంలో చూపే తేడా కూడా దీన్ని పట్టి ఇస్తుంది.

సినిమాలు చూసి చాలా రోజులైందని, ఒక రెండు మూడు మాత్రం మామ్మగారికి తెలియకుండా చూశానని రాస్తాడు modern dance practice చేసే స్నేహితుడికి. కానీ, శాస్త్రికి మటుకూ సభ్యత, సంస్కారం (జనం దృష్టిలో) ఉన్న విషయాలు రాస్తాడు. తను ఎక్కడ కచ్చేరీ ఇచ్చినది, ఎలాంటి స్పందన వచ్చింది చెప్తాడు. కాస్త గర్వం కూడా కలుగుతోంది అని అంటాడు. దాన్ని గర్హించే డైలాగ్ ఒకటి శాస్త్రి అంటాడు.

ఆ సన్నివేశంలోనే…

నేను త్యాగరాజ కృతి పాడుతుంటే నువ్వు Breakdance చేస్తే చూడాలని ఉందని రాస్తాడు. వినటానికి విచిత్రంగానో, గర్హనీయంగానో ఉన్నా అది ఒక క్రియేటివ్ థాట్. జుగల్బందీ.

<<<Writer says: Morning Raaga సినిమాలో తాయే యశోద నందన్… పాట ఎంత అద్భుతంగా ఉంటుంది! నచ్చని వాళ్ళకు నచ్చదు. కానీ కాల ప్రవాహంలో నూత్న ప్రక్రియలు వస్తూనే ఉంటాయి, ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. సత్తా ఉన్నవి చరిత్రలో నిలిచి ఉంటాయి. లేనివి మఖలో పుట్టి పుబ్బ దాకా కూడా నిలువవు.

A woman, who reportedly works and lives at the Ranaghat railway station in West Bengal, was captured on camera singing the Lata Mangeshkar classic “Ek Pyaar Ka Nagma Hai”, on the busy platform of the train station, wrote a newspaper – or in fact every newspaper and website.

The report continued saying: the video, which got some 2 million views, is a close-up of the middle-aged woman who sings the hit number which was picturised on Nanda and Manoj Kumar in the 1972 film Shor. The video has over 4,000 comments and the sentiment is one of overwhelming adoration. Then there are the ones who rued that her talent had been wasted just because of lack of resources.

After the first video went viral, the page posted another video of the woman singing more Lata Mangeshkar songs and hoped that she would be given an opportunity to sing in a mainstream film. The comments have branded her Lata Mangeshkar 2.0.

కనీసం ఈరోజు ఆమె పేరైనా ఎవరికన్నా గుర్తుందా? ప్రతిభ ఎవడి సొత్తూ కాదు. కానీ, దాన్ని సరైన మార్గంలో పెట్టగలిగిన వారే…>>>

దాన్ని శాస్త్రి తప్పు పడతాడు. కొత్త ఆలోచనలను స్వాతించే మనసు, స్వీకరించగల్గిన maturity ప్రపంచంలో ఏ సొసైటీకీ లేదు. ఎక్కడికక్కడ మేకు బిగింపు. కొన్ని చోట్ల అవసరమే. మరికొన్ని చోట్ల అది ప్రగతికి అడ్డుగోడ వేస్తుంది. ఆ లతా మంగేష్కర్ 2.0 లాగనే అందరూ మరచిపోయేవారేమో విషయం లేకపోతే. కానీ గంగాధరంలో విషయం ఉంది.

అనంతరామ శర్మ వల్ల గంగాధరం స్కాలర్షిప్ అవకాశం కోల్పోతాడు. అమ్మగారు వచ్చి పక్షితీర్థం మామ్మగారితో మాట్లాడి తను గంగాధరానికి సరిపోయినంత ధనం సమకూరుస్తాను అని, ఏమని సంగీత సాధనను మెరుగు పరచమని చెపుతారు. గంగాధరం మెట్ల మీద మెట్లు ఎక్కి Child prodigy అనిపించుకుంటాడు.

మూడేళ్ళు గడుస్తాయి.

గంగాధరం ప్రతిభ సానబెట్టబడుతుంది.

మరోవైపు అనంతరామ శర్మలో ఎదుగుదల ఆగిపోతుంది.

ఇక్కడే ఒక అద్భుతమైన సన్నివేశం వస్తుంది. గంగాధరం పాటల రికార్డులను అనంతరామ శర్మ విటుంటాడు. వినీ వినీ, ఆవల పేరుకుంటున్న అసూయ పెరిగీ పెరిగీ.. ఆ రికార్డులను విసిరి అవతల పడేస్తాడు. ఇక్కడ ఆ దృశ్యం చివరి ముప్పై సెకన్లను కే. విశ్వనాథ్ చూపిన విధానం అద్భుతం.

రికార్డులను అనంతరామ శర్మ క్షణకాలం చూస్తాడు. తటపటాయింపు. వేళ్ళతో వాటిని పట్టుకుని విసరాలా వద్దా అన్న డైలమా. సరస్వతీ స్వరూపం కదా. కానీ చివరకు అహంకారమే జయిస్తుంది. విసిరి పడేస్తాడు.

టేప్ మాత్రం విడిపోదు. వీణ మీద రెండు చక్రాలు టేప్ సహాయంతో వేలాడుతుంటాయి.

A symbiotic relationship between him and Gangadharam which is hanging by a thread. He has to mend it or else both will lose. It’s the beginning of free fall of Anantha Rama Sharma.

Peter Keating always envied Howard Roark. He never celebrated the genius of his apparent friend, who was a junior in the Institution, and a guy who helped him with many of his college and then professional projects.

అదే స్థితి అనంతరామ శర్మకు కూడా వస్తుంది.

అడగకుండానే గంగాధరం సహాయం తీసుకుంటాడు. అతని ప్రతిభను వాడుకుంటాడు. అది గంగాధరానికి తెలుసని తన మనసుకు కూడా తెలుసని అనంతరామ శర్మకు తెలుసు. అయినా..

(కలుద్దాం)

Exit mobile version