Site icon Sanchika

విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-21

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

Ascension To Descending

..కూడా గంగాధరాన్ని ద్వేషించటం ఆపడు.

This is an ascension into descending. పతనంలోకి ఎదిగాడు అనంతరామ శర్మ.

ఆనతినీయరా హరా!

అంటూ గంగాధరం ఆయన సన్మాన కార్యక్రమంలో ఆయన ఆనతి తీసుకుని చేసిన గానం అనతికాలంలోనే గంగాధరాన్ని నిలువెత్తున ఎదిగేలా చేసింది.

Child Prodigy Discovered

అనే న్యూస్ ఆర్టికిల్ కూడా వస్తుంది. దాన్ని గంగాధరం తండ్రి అపురూపంగా గోడ స్తంభానికి అంటించటం (ఆ అంటించటం.. నిప్పుతో కాదు), ఎవరూ లేనిది చెక్ చేసుకుని కొడుకు పోస్టర్‌ని ముద్దుపెట్టుకుంటం..

తరువాత గంగాధరం ఎదుగుదల vignettes చూపిస్తాడు కే. విశ్వనాథ్.

దానికి ముందు మరో మనస్తత్వ విశ్లేషణా bit-scene.

గంగాధరం గురించి తన హోటల్‌కు వచ్చే రెగ్యులర్ శ్రేయోభిలాషులతో మాట్లాడుతుంటాడు తండ్రి. అక్కడ వచ్చిన ప్రశ్న..

ఇంతకీ మన కథానాయకుడెక్కడ?

అప్పుడే స్కూల్‌కు వెళ్ళి గంగాధరాన్ని చూసి అతని మాస్టరు మురిసిపోవటం ఒక అమాయకమైన హిపోక్రిసీ. ఇది ముచ్చటైన వ్యవహారమే తప్ప తప్పు పట్టాల్సిన విషయం కాదు.

గంగాధరాన్ని గట్టిగానే మందలించాడాయన పురుషసూక్తం సీన్‌లో. తరువాత స్కూల్‌లో కూడా ప్రార్థన చేయనివ్వలేదు. అక్కడి నుంచీ ఈరోజు ఎదిగి ఒదిగి వచ్చిన గంగాధరాన్ని నా గురించి కూడా చెప్పరా అని అడగటం pure naivety. పిల్లవాడి ఎదుగుదల కోసం పడే తపన, తప్పుచేస్తే అవకాశం మిస్ అవుతుందనే భావన, దాని వల్ల వచ్చే కోపం. తల్లి ఇతరుల ముందు గోల చేసే పిల్లలను వాళ్ళెవరన్నా మందలిస్తారేమో అని ముందు తనే ఒకటి తగిలించే లాంటి ప్రేమ.

గంగాధరం ఎదిగేశాడండోయ్ అని ఈ సీన్లోనే శాస్త్రి స్వచ్ఛమైన చిరునవ్వు షాట్‌తో చెపుతాడు దర్శకుడు.

ఇక్కడి నుంచీ వచ్చే విగ్నెట్స్ Ayn Rand తన రచనలో వాడిన vignette technique ను వాడుతాడు విశ్వనాథ్. One of the most generic but effective techniques to show progress or fall down. ఇక్కడ గంగాధరం ఎదుగుదల, అనంతరామ శర్మ పతనం రెండూ ఉంటాయి.

ఒకవైపు గంగాధరం వివిధ సభలలో గానం చేయటం.. వాటిని వింటూ అనంతరామ శర్మ అసూయను పెంచుకుంటూ పోవటం.. ఇంకో వంక గంగాధరం తల్లి గంగాధరానికి దిష్టి తీయటం.

ఇక్కడొక ట్రాన్సిషన్ షాట్ ఉంటుంది. అది చాలా అద్భుతం.

ఒంగోలు నుంచీ వచ్చినవారు గంగాధరం సన్మానానికి అనంతరామ శర్మను ఆహ్వానిస్తారు. దానికి ముందు అనంతరామ శర్మగారి డైరీలో ఆ ఒక్కరోజే ఖాళీ ఉందని చెప్తాడు అనంత్ మామ. అంటే అప్పటికి అనంతరామ శర్మ ఊపిరి సలపనంత బిజీనే. అడిగిన వారిని ఆపి, అనంత్ మామను లోపలకు పిలుస్తాడు అనంతరామ శర్మ. ఎప్పటిలాగనే నవ్వు మొహంతో వెళతాడు అనంత్ మామ.

“ఎవరో కుర్రకుంక సన్మానానికి నేను వెళ్ళాలి. అందుకు నువ్వు ఒప్పుకుంటావా?”

అని చెంప బద్దలుకొడతాడు. క్షణంలో అనంత్ మామ కళ్ళలో నీరు. మొహంలో ఆశ్చర్యంతో కూడిన దుఃఖం. అది అసహ్యంగా మారుతుందా అని మనం ఆలోచించేలోగా వెంటనే transition to..

ఆ.. అనే ఆలాపనతో గంగాధరం మొహం వస్తుంది. అంటే.. Anantha Rama Sharma’s slap is to Gangadharam.

His ascension to descending started.

అలాగే అక్కడ గంగాధరం తల్లి దిష్టి తీసే షాట్స్‌లో వచ్చే మంట నుంచీ అనంతరామ శర్మ మొహం చూపించటం ఆయనలో ద్వేషాగ్ని రగులుతోందని మనలో రిజిస్టర్ చేయటం. ఇదంతా మన subconscious level లో ముద్ర వేస్తాడు దర్శకుడు. అందుకే విశ్వనాథ్ సినిమాలు ఎన్నిసార్లు చూసినా విసుగురావు.

అనంత్‌ను చెంపదెబ్బ కొట్టటం, అంతకుముందు చెంబు సీన్, ఈ రెండు చాలా కీలకమైన సన్నివేశాలు.

There are 5 stages of jealousy.

1.Identification: When you first feel jealous, you may notice that you are feeling insecure, anxious, or angry.

ఈ మూడిటింటినీ మనం అనంతరామ శర్మలో గమనిస్తాం.

2.Realisation: You may realise that you are jealous of someone else’s possessions, accomplishments, or relationships.

ఈ విషయం ఆయనకు కూడా అర్థమయ్యింది. కానీ, దానిని గుర్తించ నిరాకరిస్తాడు. అందుకే ఇతరుల మీద ఆ కోపాగ్ని ప్రదర్శిస్తాడు. అనంత్ మామను కొట్టటం.

అనంత్ మామనే ఎందుకు? అమ్మగారి మీద చేయి లేవదెందుకు? ఆ కాలంలో ఇప్పటి awareness అంతగా లేదే? ఏమిటా తేడా? ఇంట్లో ఆధారపడి ఉంటున్నాడనా? మరి అమ్మగారి పరిస్థితి కూడా అదే కదా! కచ్చితంగా గుర్తుపెట్టుకుని పరిశీలిద్దాం. మనకు జీవితంలో పనికి వచ్చే చాలా విషయాలు తెలుస్తాయి.

3.Rationalisation: You may start to make up stories about what the other person is doing or thinking, and you may compare yourself unfavorably to them.

ఎవరో కుర్రకుంక సన్మానానికి నేను వెళ్ళాలి!!! అంగీకరించాడు కానీ..

4.Actualization: Your jealousy may manifest itself in your behaviour, such as becoming withdrawn, controlling, or aggressive. You may also start to avoid the person you are jealous of.

కానీ ఇక్కడ అలా avoid చేయలేదు. ఎదుగుదలను ఆపేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తాడు.

దానికి ముందు దర్శకుడు కొన్ని సిగ్నల్స్ వదులుతాడు. అవి గుర్తించాలి.

5.Escalation: If jealousy is not addressed, it can escalate into more serious problems, such as violence or stalking.

క్లైమాక్సు అదే. గంగాధరం మీద చేయి చేసుకోవటం.

(కలుద్దాం)

Exit mobile version