Site icon Sanchika

విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-23

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

అజ్ఞానంలో బ్రహ్మజ్ఞానం – 1

[dropcap]నే[/dropcap]ను ఆ సమయంలో ఒక పుస్తకం కోసం వెతుకుతున్నాను. ఎంతసేపటికీ దొరక్క చిరాకుగా ఉంది. పైగా ఎండ ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతోంది. సాయంత్రం నాలుగు కావస్తున్నా.

బాగున్నారా? అడిగాను.

తల పంకిస్తూ లోపలకు వచ్చారాయన. లోపలకు ఆహ్వానించి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టాను. నేను కింద కూర్చున్నాను.

అమ్మగారు బాగున్నారా? అడిగాను.

మరోసారి తల పంకించారు.

ఆయన ఏదో సీరియస్ విషయం అడగటానికే వచ్చినట్లు ఉన్నారు. నేను కూడా ఆయన వైపు ఆ విషయమేదో త్వరగా అడగండి అన్నట్లు చూస్తున్నాను. మంచినీళ్ళ చెంబు కింద పెడుతూ అన్నారు.

నన్ను పీటర్ కీటింగ్ అన్నావు. కారణం అడిగితే తరువాత చెప్తాను అన్నావు. ఈలోగా నువ్వేదో నీ మానాన రాసుకుంటున్నావు కానీ, అసలు విషయానికి రావటం లేదు. ఏమి? కథనం దారి తప్పింది? – ధాటిగా, గంభీరంగా అన్నారు. ఆ స్వరంలోని పటుత్వం తగ్గలేదు.

నా అంతటి వాడిని నేను. అలాంటి నన్ను పట్టుకుని నువ్వు ఇలా అంటావా? అన్నదానికి సరైన కారణం కూడా చూపలేదు. సహేతుకమైన వివరణ ఇవ్వలేదు.

నేను ఆయన వైపు తదేకంగా చూస్తూ ఉన్నాను. నాళ్ళు అగ్ని గోళాల వంటి ఆయన కళ్ళను తట్టుకోవటం కష్టంగానే ఉండాలి నిజానికి. ఆయన మాట్లాడుతున్నది శాంత స్వరంలా ఉన్నా, ముఖకవళికలను గమనిస్తే ఆగ్రహం ద్యోతకమవుతోంది. అన్యాయంగా ఆయనను నేను విమర్శిస్తున్నానని ఆయన భావన. కానీ నా వైపు సరైన డేటా ఉంది. అది అందరికీ తెలిసినదే. నేను ఆ డేటాను మరొకరికి సాధ్యం కాని రీతిలో విశ్లేషిస్తున్నాను. దాన్ని అనుకున్నంత గొప్పగా చెప్పగలుగుతున్నానా అన్నది ఈ క్షణానికి పక్కన పెడితే, నేను చెప్తున్నా మాటలు సత్యాలే. నేను వాటిని కొన్ని రిఫరెన్సులున్నాయి ఆధారంగా అవగతం చేసుకుంటూ ఆ యా మనుషుల ఆలోచనా ధోరణిని, వారి మనస్తత్వాలకు మూలాన్ని, వాటి వల్ల ఆ యా వ్యక్తులు తమ పర్సనాలిటీలను ఎలా మల్చుకున్నారు అన్నది నా పరిశోధన.

శర్మగారూ, మీ ప్రశ్నకు సమాధానం మీరే ఇచ్చేశారు – నేను అన్నాను.

ఆయన నావైపు ఆశ్చర్యంగా చూశారు. ఆ ఆశ్చర్యం ఒకానొక అలవికాని ఆలోచనగా, మారి ఆయన మొహంలో ప్రశ్నార్థకం చిహ్నం వచ్చి చేరింది. ఇంతలో బైట ఎండ తగ్గింది. డార్క్ స్కై మాడెడ్ యాప్ చెప్పిన ప్రకారం మరో పది నిముషాలలో వర్షం పడుతుంది. దానికి తగిన వాతావరణం ఏర్పడుతోంది.

ఎక్కడ? అని అడగటానికి ఆయనకు vanity అడ్డు వస్తోంది. నేను సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను. ఆయనా రెట్టించలేదు. నా వైపు తీక్ష్ణంగా చూస్తున్నారు. నేను కూడా నా expression ఎలా ఉన్నదా అనే ఆలోచనలో ఉన్నాను. నిజం చెప్పొద్దూ నాకు The Fountainhead లో ఒక కీలకమైన సన్నివేశం గుర్తుకు వచ్చింది.

Gail Wynand takes Howard Roark to Hell’s Kitchen. There he wants to build the tallest and the greatest structure in the world. He wants to commission Roark for it. He knows only Roark could understand what type of structure he has in his mind. It’s a skyscraper to end all the skyscrapers. To represent the spirit of Howard Roark and could have been Wynand’s.

He wants it as a redemption for his frail moments as he understood that one can live like Roark during his friendship with Roark, and as a tribute to the greatest human spirit.

He is brimming with excitement. But Roark is a calm figure. Gail Wynand knows Roark knows what he wants to tell. Also he knows Roark doesn’t care to express his own curiosity. But WY andw Waits. Roark doesn’t budge. After a long silence, Wynand concedes and tells Roark what he wants to tell. Roark laughs hearttily at the comical plight of Wynand.

ఎక్కడ? – అనంతరామ శర్మ గారు అన్నారు చివరకు.

దారి తప్పుతోంది అన్నారు కదా. చదవలేదా?

అంతటి విద్వాంసుడు నేను ఏమన్నా అవమానిస్తున్నానా అని చిన్న అనుమానం. అంతలోనే నాకొక చిత్రమైన ఆలోచన వచ్చింది. ఆయన అనుమతి తీసుకుని పక్క గదిలోకి వెళ్ళాను. అక్కడ నా ఫోన్ నుంచీ టీవీఔట్ ఇస్తూ టీవీలో యూట్యూబ్ తెరిచాను. స్వర్ణ కమలం సినిమా కోసం వెతికి మంచి ప్రింట్ ఉన్న దానిని ఎంచుకుని దాన్ని పాజ్ లో పెట్టాను. సమయమాసన్నమైంది అన్నట్లు అక్కడే టీవీ వెనకాల నాకు నేను చాలా సేఫ్టీ నుంచీ వెతుకుతున్నాను పుస్తకం దొరికింది.

The Early Ayn Rand!!

నేను శర్మగారి వద్దకు వెళ్ళి లోపలకు రమ్మని అభ్యర్థించాను. ఆయనను ఉచితాసనంలో కూర్చోపెట్టి ఆయన పక్కనే నేల మీద కూర్చున్నాను.

మీరు మొదలు పెట్టిన ఆటను మీచేతే ముగింపచేస్తాను. ఇవాళ. ఇక్కడే!

(కలుద్దాం)

Exit mobile version