విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-25

1
2

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

Dive Into the Future Past

..తెలియకుండానే నా తల మీద చేయి ఉంచి అన్న మాట చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా. కానీ ఆశ్చర్యపోవటం నేను అప్పుడు చేయాల్సిన పని కాదు. దానికి వేరే సమయం ఉంది.

ఇక ఆలస్యం చేయకుండా టీవీ సరిచేసి పాజ్ బటన్ మళ్ళీ నొక్కాను.

తెరమీద స్వర్ణకమలం సినిమా.

కే. విశ్వనాథ్ సినిమాల్లో అత్యంత ఉత్కృష్టమైనది, అత్యున్నతమైన మూడు సినిమాల్లో ఒకటి ఈ సినిమా. అసలు ఈ సినిమాలో వాడిన టెక్నిక్ చాలామంది ఆ నృత్యగానాల ప్రవాహంలో, సంగీత మాయాజాలంలో చిక్కుకుని గ్రహించరు. అంతా చూస్తారు. అందరూ పప్పులో కాలు వేస్తారు. ప్రత్యేకించి క్లైమాక్సు విషయంలో.

దానికన్నా ముందు మనం గ్రహించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి.

ఒకటి ఈ సినిమా కే. విశ్వనాథ్ తన ఫిలాసఫీని, ఆలోచనలను దట్టించి తీయాలనుకోలేదు. అనుకుని ఉండవచ్చు కానీ, కథలో అసలు థీమ్.. experiencing the simplest but beautiful moments in life. ఈ క్షణాన్ని ఆస్వాదించటం ప్రధానమైన విషయం.

చంద్రాన్ని మనకు పరిచయం చేశాక అతను పింకును వెతుక్కుంటూ వెళ్ళే సీన్, తరువాత పింకు బాబు పాత్ర పరిచయం.

హాయిగా నిద్ర పోతుంటాడు. చూస్తే అమ్మ ఒడిలో పాపాయిలా అనిపిస్తాడు. కానీ, అక్కడ ఉన్నది అమ్మ కాదు. అది ఒక బొమ్మ. చిత్రపటం. లేదా పెయింటింగ్. విశ్వనాథ్ ఈ భాగాన్ని అద్భుతంగా సృజియించాడు. Creativity at its peak.

But this is not the scene I’m waiting for!

తరువాత వచ్చే సీక్వెన్స్ లో హీరోయిన్, ఆమె కుటుంబం, వారి జీవనం చూపిస్తారు.

This is also not the moment I’m waiting for.

శ్రీలక్ష్మి, సాక్షి రంగారావుల హాస్యం కట్టిపడేస్తుంది.

But this is also not the moment I’m waiting for.

రేయ్! స్వాతికిరణంలో అణువణువూ వెతికి బోర్ కొట్టించిన వాడివి స్వర్ణకమలంలో ఇంత స్కిప్ చేస్తావా? పైగా ఈ సినిమా..

<<<కే. విశ్వనాథ్ సినిమాల్లో అత్యంత ఉత్కృష్టమైనది, అత్యున్నతమైన మూడు సినిమాల్లో ఒకటి ఈ సినిమా.>>>

అని కటింగ్ ఒకటి ఇచ్చావు పైన!

అని నా ఆత్మడౌనీ ప్రశ్నించాడు.

ఆగు స్వామీ, ఇక్కడ కథను విశ్లేషించటం పని కాదు. స్వర్ణకమలం కథ, కథనాలకన్నా ఈ సినిమా theme చాలా ముఖ్యం.

Everyone talks about the artistic values, dance and music, artiste’s performances. But they miss the profound truth that was authentically and intensely but under-currently shown in this film.

Nothing is impossible in a benevolent universe – Ayn Rand, in Good Copy (a 1929 short story that can be read as part of The Early Ayn Rand).

జీవితమనే ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగటం గురించి.

మన పింకు పరిచయ సన్నివేశంలో చెప్పే డైలాగులు జాగ్రత్తగా తరువాత గమనిద్దాం. అవి ఎంత లోతైన భావనలో తెలుసుకుందాం. కానీ, దానికన్నా ముందు చూడాల్సిన విషయం ఒకటి ఉంది. అసలే ఆ విషయానికి రావటానికి కాస్తాలస్యం అయింది.

అయినాక మన పింకు ఆ ఇంటి ముందు మొహాన వీబూది పూసుకుని దిగుతాడు రిక్షాలో నుంచీ.

ఓంకారం గారి కోసం అడుగుతాడు భక్తి బాధితుడు ఓంకారేశ్వరరావు గారిని.

నేనే అంటాడు సాక్షి ఓంకారం గారు.

నమ్మడు పింకు.

నిజంగానే నమ్మడా? ఎందుకు నమ్మడూ? ఆ మాత్రం తెలియకనా? మనకొక జీవిత సత్యాన్ని తెలియజేసేందుకు తెలిసో తెలియకో ఆడిన నాటకం.

“భలేవారు సార్! మీరెక్కడ! ఆయనెక్కడ? ఆయన బ్రహ్మజ్ఞాని!”

ఈ డైలాగ్ వస్తుంది.

నిజంగానే భబా ఓంకారం గారు బ్రహ్మజ్ఞానా?

మనం హాస్యాన్నే చూస్తాము కానీ, ఆ సన్నివేశంలోని గాఢతను చూడము. దానికి ఆద్యం ఆ సీక్వెన్స్ మొదటి క్షణంలోనే పడినా, మనం గ్రహించము. బృహత్తరమైన విషయాలు, గుహ్యమైన సత్యాలు మన కళ్ళముందు కదలాడుతాయి కానీ, అవి అంత త్వరగా మనకు పట్టవు.

కనీసం నారాయణ అనక పోయినా అందులో సగం అయినా అంటుందని ఒక బామ్మగారు పోయే ముందు ఒక వస్తువును చూపిస్తే ఆవిడ పీచు అని హరీమంటుంది కానీ, నార అనదు. అంత అజ్ఞానులం మనం.

పింకు అన్న మాటలకు ఆయన సమాధానం, “ఆ అజ్ఞానిని నేనే!”

ఎంత హాయిగా ఒప్పుకున్నాడు? ఎంత చులాగ్గా ఆ పిల్లాడితో కలిసిపోయాడు?

ఇదే అజ్ఞానంలో బ్రహ్మజ్ఞానం!

మనకు తెలియని దాన్ని తెలియదు అని గ్రహించటం. ఒప్పుకోవటం. ఏ విధమైన వేనిటీ లేకుండా హాయిగా జీవించగలగటం.

ఎంతమంది చేయగలరు? ఈ క్షణంలో జీవించు. Be in the present as it is the present.

ఇంత చులాగ్గా అంత గొప్ప సత్యం చెప్పేస్తారు ఓంకారం గారు. పేరు కూడా చూడండి! ఓంకారం గారు.

అందుకే భార్య చందును చూసి వెంకటేశ్వరస్వామిలా ఉన్నాడు అని చెప్పినా, ఆయన మాత్రం పెరియాళ్వార్ అని పేరు పెడతాడు.

ఎందుకు?

నేను అనంతరామ శర్మ గారి వైపు చూసి గ్రహింపుగా నవ్వాను. ఆయన నా భుజం మీద చెయ్యి వేసి తట్టారు.

ఆ లిప్తపాటులోనే నాకు అర్థమయ్యింది. మా ప్రయాణం.. Dive Into Future Past.. సరైన మార్గంలోనే మొదలయ్యిందని.

మొట్టమొదటిసారి శర్మగారి మోము పైన..

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here