[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]
మీనాక్షీ చంద్రశేఖరం
[dropcap]మ[/dropcap]దురైకు సమీపమునున్న శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామమునందు ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించినవారు పెరియాళ్వార్ అనబడే భక్తుడు. ఆయన జన్మ నామము విష్ణుచిత్త. అదే సార్థకనామధేయం కూడా అయి, ఆయన చిన్నతనం నుంచే విష్ణ్వారాధనలో మునిగితేలేవారు. ఆయనకు వటపత్రశాయి పెరుమాళ్ అంటే అమిత భక్తి. శ్రీకృష్ణ లీలలను నిరంతరం స్మరిస్తూ ఉండేవారు.
అంత గొప్ప భక్తుడైన, స్వయంగా స్వామివారితో మాట్లాడగలిగే శక్తి ఉన్నా ఆయనకు లేశమాత్రమైననూ అహంకారం లేదు. అసలు ఆయన తత్వం నీవు తప్ప ఇతఃపరంబెరుగను అని. అంతటి వారు కూడా తాను అజ్ఞానినని, తనకు ఏమాత్రం పాండిత్యం లేదని భావిస్తారు. అందుకే స్వయంగా శ్రీమహావిష్ణువు వచ్చి పండిత చర్చలో పాల్గొని నారాయణుని మించిన పరదేవత లేరని నిరూపింపమని ఆజ్ఞాపించినా, అర్థించినా నావల్ల కాదు స్వామీ అనేస్తాడు. నాకు తెలసినదల్లా నీకు తులసి, పూల మాలలు కట్టి ఇవ్వటమేనని, శాస్త్ర చర్చలలో పాల్గొని పండితులను జయించటం తనకు సాధ్యం కాదని వినయంగా విన్నవిస్తాడు.
అప్పుడు శ్రీమహావిష్ణువు నోట ఒక గొప్ప మాట వెలువడుతుంది. విష్ణుచిత్తా, నీవు నన్నే ఎందుకు పరధర్మంగా భావిస్తున్నావు? నీకు జన్మాంతర సంస్కారమువల్లనో, జన్మ తీసుకునేందుకు కారణం కారణభూతమైన విశేషం వల్లనో ఎరిగి ఉన్నావు కనుక. అందుకే నా సేవలో నీవు తరించాలని భావిస్తున్నావు. అంటే నా శరణాగతి నీవు చేసి ఉన్నావు. కానీ, నా గురించి నీకు తెలుసు. కనుక వెళ్ళి అక్కడ పండిత చర్చలో పాల్గొనుము. మిగతాది నేను నడిపిస్తాను.
గ్రహించండి. విష్ణుచిత్తులవారు సామాన్యులు కారు. ఆయనకు తెలియనిది లేదు. అయినా ఆ జ్ఞానాన్ని మరుగున పరచుకుని కేవలం పరబ్రహ్మ మీదనే దృష్టియుంచి శరణాగతి చేసిన వ్యక్తి ఆయన. అందుకే పరతత్వ విచారణకు ఆయనకు మించిన అర్హత వేరొకరికి లేదని సాక్షాత్ శ్రీమహావిష్ణువే స్వప్న సాక్షాత్కారం ఇచ్చి వెళ్ళమని ఆదేశించారు.
జాగ్రత్తగా చూడాలి. విష్ణుచిత్తులవారు విష్ణువు కాదు. కానీ విష్ణుతత్వాన్ని గ్రహించగలిగిన వారు. అందుకనే జయించుకు వచ్చారు. ఆ కథ మనకిక్కడ అనవసరం. కానీ ఈ సినిమాలో చందు పాత్రను ఓంకారంగారు పెరియాళ్వార్ అని విష్ణుచిత్తుల వారి బిరుదముతో సంబోధించుట… ఆయన ఒక మనిషిని చూడగానే వారు స్వరూప స్వభావాలను గ్రహించగలరు అన్నది తెలియజేస్తుంది. This includes the cute cunning of Pinku Babu.
చందు ఒక కళాకారుడు. కానీ గొప్ప స్థాయి అందుకున్న వ్యక్తి కాదు. భుక్తి కోసం కళను వాడుకొనగలిగిన వ్యక్తి ఆ సమయానికి. కానీ అతనిలో కళాదృష్టి ఉంది. కళ యొక్క గొప్పతనాన్ని గ్రహించగలడు. ఒక గొప్పకళాకారుడిని లేదా కళాకారిణిని చూస్తే గుర్తుపట్టగలడు. అందుకే చందు మీనాక్షి.. నాట్యానికి అంకితమవ్వాలని కోరుకున్నాడు.
She has a celestial talent that was hidden in the layers of innocent vanity and self-indulgence with other things. వాటిని ఛేదిస్తే ఆమె గొప్పతనం ఆమెకు తెలుస్తుంది. అందుకే అంత పట్టుదలగా ఆమెను కళ మీద దృష్టి పెట్టేలా చేయాలనుకుని ఛీత్కరింపబడినా ప్రయత్నాలు చేశాడు. ఆమెలోని కళాకారిణిని ఆవిష్కరించాడు. లేదా ఆవిష్కరింపబడేలా చేశాడు.
అందుకే గొప్ప మనిషిగా నిలిచాడు.
చందులో ఈ తత్వాన్ని తెలిసి చేసినా, తెలియకచేసినా ఓంకారం గారి సంబోధన ఆయన గొప్పతనాన్ని పట్టి ఇచ్చేదే.
అజ్ఞానంలో బ్రహ్మజ్ఞానం!
చాలా చిన్నవైన జీవిత సత్యాలను, సూక్షమైనవైనా మనిషిని ఆనందంలో ముంచెత్తేవాటి గురించి స్వర్ణకమలంలో చర్చ.
This is the massiest creation of K. Vishwanath. ఎటు తిరిగీ మనిషికి కావలసింది ఆనందం. దాన్ని శోధించి సాధించినా, ఎరుకతో గ్రహించినా, జీవనయానాన్ని వచ్చింది వచ్చినట్లు స్వీకరిస్తూ సాగించినా మనకు చివరకు మిగిలేది, మిగిలాల్సింది తృప్తి. అది లేని జీవితం గొప్ప వైఫల్యం.
శర్మగారి వైపు చూశాను. ఆయన గంభీరంగా అర్థమయింది అన్నట్లు నా వైపు చూశారు. సాలోచనగా తల పంకించారు. సినిమా కొనసాగుతోంది. ముగింపుకొచ్చింది.
ఎంత సమయం గడిచింది అనేది మాకు అక్కడ అనవసరం. మొదలు పెట్టిన పనిని సరైన ముగింపుకు తీసుకు రావటం నా బాధ్యత. దానిలో పాత్రధారి, సూత్రధారి కనుక అనంతరామ శర్మ గారు నా వెంట ఉండాలి. ఆయనకు అభ్యంతరం కనిపించలేదు. ఇక సమస్య ఏమిటి?
స్వర్ణకమలం సినిమా ముగింపు చాలామందికి అర్థం కాలేదు. ఒక్కొక్కరి వ్యాఖ్యానం ఒక్కొక్క రీతిన ఉంది. కానీ ఈ సినిమా ముగింపు కే విశ్వనాథ్ అద్భుత కథన నైపుణ్యానికి మచ్చుతునక. ఎలా?
చూద్దాం!
మొన్న పేపర్‌లో మీనాక్షీ, చంద్రశేఖర్‌లు ఇండియా వచ్చారని, మీనాక్షి శిష్యురాలి అరంగేట్రం దేశ రాజధానిలో జరుగబోతోందని, దానికోసం వారు వచ్చారని చూశాను.
హస్తినకు రాగలరా? అడిగాను. అవసరమైతే మా నాన్న బట్టలు మీకు తగినవి ఏర్పాటు చేస్తాను. నా ప్రామిస్ నెరవేరుస్తాను. If you trust me.. join me in the journey to meet an important duo who’ll answer a few questions and clarify the doubts. మీకు కూడా కాస్త వాతావరణం మార్పుగా ఉంటుంది.
ఆయన దీర్ఘాలోచనలో ఉండి కళ్ళతో అంగీకారం తెలిపారు.
విశ్రాంతి తీసుకోండి. తెల్లవారుఝామున కేబ్ వస్తుంది. మీకు కావలసిన ఏర్పాట్లు స్వయంగా చేస్తాను.
పెరియాళ్వార్ చూపిన దారి గురించా నువ్వు ఇవ్వబోయే పరిష్కారం? ఆయన స్వరం మంద్రంగా ప్రతిధ్వనించింది.
(కలుద్దాం)