విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-7

4
2

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

The Sanction of the Victim

[dropcap]రే[/dropcap]య్ శరత్తూ! కాస్త నన్ను ఇంటిదాకా దింపరా. కిరణ్ అడిగాడు.

ఒరే నాకు డబుల్స్ రాదురా. శరత్ అన్నాడు.

ఏముందిలేరా. నేను తొక్కుతాను. నువ్వు వెనకాల కూచో. మా ఇల్లు మీ ఇంటి కెళ్ళే దారే కదా. సరిపోతుంది. కిరణ్ నచ్చజెప్పాడు.

సరే! అలాక్కానీ. అని శరత్ సైకిల్ వెనుక కూచుని అలా లిఫ్టిచ్చాడు.

***

ఏరా శరత్తూ! ఇందాకన నీ సైకిల్ని తొక్కిందెవర్రా? గోపాల్ బాబాయడిగాడు.

మా ఫ్రెండ్ కిరణ్ బాబాయ్. శరత్ అన్నాడు.

ఇంకెప్పుడూ వాడికి లిఫ్టివ్వకు. నిన్ను కూచోబెట్టి వాడే సైకిల్ తొక్కేస్తాడు. నువ్వు చవటల్లే వెనక్కూచోవాలి.

అలాగే బాబాయ్! శరత్ కాస్త నొచ్చుకుంటూ బెరుకు బెరుగ్గా అన్నాడు.

***

రేయ్ శరత్తూ! కాస్త నన్ను ఇంటి దాకా దింపరా. కిరణ్ అన్నాడు.

కాసేపు కిందా మీదా పడ్డాక శరత్ అన్నాడు. సరే రా! వెనక్కూచో.

అదేంట్రా! నీకు డబుల్స్ రాదుగా? కిరణ్ అన్నాడు.

వచ్చులేరా. నేర్చుకున్నాను. శరత్ సమాధానం చెప్పాడు.

***

ఏరా శరత్తూ! ఆ కిరణ్ గాడు మహరాజులా వెనక కూచుంటే నువ్వు రిక్షా వాడిలా ముందు కూచుని సైకిల్ తొక్కుతా? వాడికి లిఫ్టిస్తూ.. గోపాల్ బాబాయ్ అన్నాడు.

దీనికి సమాధానంగా శరత్ ఏమన్నాడు? ఏమి చేశాడు?

నీతి: ఇంకెప్పుడూ సైకిల్ వాడ కూడదు. 😀

***

ఒక మామూలు కథే ఇది. ఎప్పుడూ మన ఎదురుగ్గా జరిగే లాంటి కథే ఇది. ఎన్ని చూడలేదు. అయినా మన జనాలు పాఠాలు నేర్చుకోరు. ఇక్కడి శరత్ మరో చోట గోపాలం బాబాయ్ రోల్ పోషించవచ్చు. లేదా శరత్తే కిరణ్ కావచ్చు.

***

ఐన్ ర్యాండ్ నవలల గురించీ, ఆమె ప్రతిపాదించిన ఫిలాసఫీ ఆబ్జక్టివిజమ్ అందరికీ నచ్చకపోవచ్చు. దాని ప్రాక్టికాలిటీ గురించి అనుమానాలుండవచ్చు. కానీ, ఎవరైనా సరే ఒక్క విషయం మాత్రం ఒప్పుకొని తీరాలి. ఆమె social and/or societal observation skills కు మటుకూ వంక పెట్టేందుకు లేదు.

మనుషుల మనస్తత్వాలను చులాగ్గా గ్రహిస్తుంది. స్త్రీ సహజమైన instincts కొంత వరకూ కారణమైనా, ఆమెకున్న observation skills, analytical mind, deep roots in philosophisticated thought process ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

తను రాసిన అద్భుతమైన నవల అట్లాస్ ష్రగ్డ్ లో హాంక్ రేర్డెన్ ఒక కథానాయకుడు. అతనిని ఆధారంగా చేసుకుని ర్యాండ్ గొప్ప గొప్ప లక్షణాలుండి, achievers అయిన first handed people కూడా తమకున్న కొంత అవగాహనా లేమి లేదా తమలో తమకు తెలియని లోపాలు వల్ల బాధితులుగా మిగలటాన్ని గురించి వివరిస్తుంది. ఇలాంటి వారు తాము ఇతరుల లోపాల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చగలమని, అందుకు తాము చేయాల్సిందల్లా మరింత కష్టపడటమే అని అనుకుంటారు. అదే వారిపాలిట శాపం అని తెలుసుకోరు.

వీరు సమాజాన్ని లెక్క చేయడం అనుకుంటూనే సమాజానికి తమను బాధించేందుకు, బంధించేందుకు తగిన శక్తిని ఉత్పత్తి చేస్తుంటారు.

ఇప్పుడు ఇంకో కథ చూద్దాం.

***

ఇంకో కథ చూద్దాం. మా స్కూలు చివరి రోజుల్లో మేము బాగా నేర్చుకున్న ప్రిన్సిపుల్.

ఒకప్పుడు ‘అమలాపురం ఐశ్వర్యా రాయ్’, ‘భీమవరం బిపాషా బసు’ అని ఇద్దరమ్మాయిలు స్నేహితులు. ఇద్దరిదీ ఒకే కంచం, ఒకే మంచం. పెళ్లి కాక ముందు లెండి. అప్పటికి ఢిల్లీ హైకోర్టు తీర్పు రాలేదు.

వీళ్ళకి కాలం ఖర్మం కలిసొచ్చి (కలిసి రాక) పెళ్ళి అయింది. వీళ్ళ భర్తలూ పాపం స్నేహితులే. వీళ్ళ స్నేహాన్ని చూసి దేవుడికి కుళ్ళు పుట్టిందేమో.. పాపం వాళ్ళ వాళ్ళ భర్తలు ఒకేసారి యాక్సిడెంటులో మరణించారు.

అమ్మలక్కలూ, అయ్యలన్నలూ వచ్చి వారిని పరామర్శించేవారు. కొంతకాలానికి ‘భీమవరం బిపాషా బసు’ ఒకతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని మళ్ళీ సుఖంగా ఉంది. ఐతే ఆమె స్నేహితురాలు ‘అమలాపురం ఐశ్వర్యా రాయ్’ మాత్రం విషాదం లోనే మునిగి ఉంది.

అప్పుడు అమ్మలక్కలూ, అయ్యలన్నలూ, తనతో “ఎందుకమ్మాయీ అంత బాధపడి పోతావూ.. పాపం! ఎంత కాలమలా ఉంటావ్? నువ్వూ ఉప్పూ కారం తినే దానివే కదా! చిన్న వయసు లోనే ఎంత కష్టం?” అనే వాళ్లు. కొంత కాలం తరువాత “అమ్మాయీ! మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా గతాన్ని మరచి పోయి జీవితాన్ని అనుభవించమ్మా! చిన్న దానివి. ఇంకా ఎంతో జీవితాన్ని చూడాలి.” అన్నారు.

ఇక ‘భీమవరం బిపాషా బసు’ గురించి మాత్రం “భర్త పోయి రెండేళ్లన్నా కాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకుని కులుకుతోంది. చూడమ్మా చోద్యం!!!???” అన్నారు.

***

లోకులకు కావలసింది కేవలం ‘ఉపదేశామృతం’ పంచి పెట్టే మహదవకాశం.

మన దేశంలో ఇప్పటి టాక్స్ సిస్టమ్ చూడండి. మధ్య తరగతి వారికి పనుకొచ్చేవి ఏవీ ఉండవు. అటు పేదలకు పథకాలు, ఇటు ధనవంతులకు రైటాఫ్లు. వీరికి మటుకూ వాయింపుడే.

మొదటే ఎత్తుకున్న కథలో శరత్ తన స్నేహితుడికి లిఫ్ట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అతని చాయ్స్. ఎవరు నడపాలి, ఎవరు వెనుక కూర్చోవాలి అనేది కూడా ఇందులో involve అయిన ఇద్దరి చాయ్స్. ప్రత్యేకించి ఆ సైకిల్ గోపాలం బాబాయ్‌ది అయితే తప్ప అసలు గోపాలం బాబాయ్ involvement అనవసరం.

కానీ, మన సామాజిక గోపాలం బాబాయ్‌లు ఆగరు. ఏదో ఒకటి అననిదే అలాంటి వారి నోరు ఊరుకోదు.

అలాంటి వారికి నిజానికి అలా అనే శక్తిని లేదా అలుసును ఇచ్చింది ఎవరు? ఆ బాధితులే. Ayn Rand అదే అంటుంది.

It is the sanction given by the victim that gives the power to the others to insult or shame or do bad things. శరత్ అసలు వారి మాటలను లెక్కచేయకపోతే అవతల వారు అతన్ని బాధించలేరు. లేదా కంట్రోల్ చేయలేరు.

నా ఇష్టం!

ఈ ఒక్క మాట చాలు. అవతల వారి నోళ్ళు మూయించేందుకు.

అలా అనుకున్న, మళ్ళీ వివాహం చేసుకున్న భీమవరం బిపాషా బసును లోకులు ఆడిపోసుకున్నారు. కానీ దానివల్ల ఆమెకు వచ్చిన నష్టం సున్నా. అలాగే అమలాపురం ఐశ్వర్యా రాయ్ కూడా. ఆమెకు మరో వివాహం ఇష్టం లేకపోతే ఆమె తనకు కావలసిన విధంగా భర్త జ్ఞాపకాలతో, ఒంటరిగానో మరో విధంగానో జీవించవచ్చు. ఇక్కడ ఒకటే కండిషన్. ఎవరికి వారు వారి అంతరాత్మకు సమాధానం చెప్పుకోవలసిన పని ఉండకూడదు. అదే ఐన్ అమ్మమ్మ చెప్పిన వేదం.

ఈ Sanction of the Victim అనే దాని గురించే అట్లాస్ ష్రగ్డ్ నవల నడుస్తుంది.

All the creators are in one way or the other are victimised by those around them. But it is their consent that has given power to those around the creators to abuse them. What if the creators refuse to be the sacrificial animals and shrug off the others?

The second handers cannot do anything.

దీనిలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.

కే విశ్వనాథ్ తీసిన Guru Quadrulogy లో Sanction of the Victim అన్నది ప్రస్ఫుటంగా కనిపించేది గంగాధరం విషయంలో. తనకు తానుగా తెలిసో, తెలియకో అనంతరామ శర్మకు తలొగ్గాడు. ఆయన మాటకు విలువ ఇచ్చాడు. చివరకు తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు.

అది ఎలా? దీని వెనకాల ఉన్న రూట్స్ ఏమిటి అన్నది..

(కలుద్దాం)

Fun fact:

Legendary Hollywood director King Vidor directed the film version of The Fountainhead. Gary Cooper played Howard Roark. Ayn Rand hated the film.

కానీ శంకరాభరణం చూశాక నాకు అనిపించిన సంగతి, K. Vishwanath could well have been the best choice to direct The Fountainhead classic version. Ayn Rand would have approved his version.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here