Site icon Sanchika

విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-8

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

నీలకంధరా దేవా

[dropcap]గం[/dropcap]గాధరం లాంటి వారు మనకు నిజ జీవితంలో తరచుగానే తారస పడుతుంటారు. చాలా సూక్ష్మంగా గమనించాలి. కానీ గంగాధరం అంత ప్రతిభ ఉన్నవారు అత్యంత అరుదు.

అంత ప్రతిభ ఉండటం, దానికి తగిన ఒద్దికా ఓపికా ఉండటం, పెద్దలను గౌరవించే లక్షణాలు.. ఇవన్నీ అతన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అతనిని నిజానికి ఎవరూ సానబెట్టాల్సిన పని లేదు. అటు గంగాధరానికి సంగీత పాఠాలు నేర్పిస్తున్న జయంతి (నటి పేరు) కానీ, అటు బడిలో పాఠాలు నేర్పే మాస్టారు కానీ, తన అసలైన ప్రతిభను పట్టుకోలేక పోయారు.

Gangadharam was a child prodigy. Modern day Indian education system has no proper system to recognise a child prodigy nor is it capable of honing their skills properly. God knows about assessing the capabilities of a child in a proper way. అందుకే మనం మన పిల్లల మీద మనకు కావలసిన కోరికలు రుద్ది, మన చేతకాని తనాన్ని, ఫెయిల్యూర్లను వారికి బహుమానంగా ఇస్తాము. కొన్నిసార్లు సరైన దారిలో పెడతారు. అందరూ ఇలా అని కాదు కానీ.. ఈ స్టేట్మెంట్ గమనించండి.

If man is left with his own knowledge, without unnecessary influences of others right from his birth, the world would have been doubly, better, and triply developed – Ramanujan, in The Philosopher

నిజమా కాదా అన్నది పూర్తి స్థాయిలో ఇంకా నిరూపింపబడలేదు కానీ, సరైన దారిలో పెడితే పిండదశ లోనే రాక్షసుడు మహా భక్తుడు కాగలడని ప్రహ్లాదుడు, ప్రతిభకు, జ్ఞానానికి వయస్సుతోనే కాదు గర్భవాసియా? జననుడా (పుట్టిన వ్యక్తి) అనే తేడా కూడా ఉండదని అష్టావక్రుడు నిరూపించారు.

అష్టావక్రుడి కథ Sanction of the Victim కు antidote.

ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ కాలానికి తగిన వారి లాగనే అతను వేద పారాయణం, నిత్యాగ్నిహోత్రం మొదలైనవి చేస్తూ ఉండేవాడు. సహజ పాండిత్యం, శ్రద్ధ కలిగిన వాడు కనుక, తను చేస్తున్న పనిలో నిష్ణాతుడు కనుక, తపస్వి కనుక అతని దగ్గర చాలామంది శిష్యరికం చేసేవారు.

అతడు నిరంతర తపోనిరతుడు. దానితోపాటూ విపరీతమైన శ్రమ చేసేవాడు. దానికి తగ్గట్టుగానే విశ్రాంతి అనే మాట లేకుండా అతని శిష్యుల చేత కూడా శ్రమ చేయించేవాడు. ఆయన భార్య పేరు సుజాత .ఆమె ఉత్తమురాలు. దొడ్డ ఇల్లాలు. భర్తకెన్నో ఉపచారములు చేసేది.

శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు. కొంత కాలానికి సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది. ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు. This is true. And can stand the scientific tests.

అది కాదు అసలు విషయం.

ఒకనాడు తండ్రి తన శిష్యుల చేత వల్లె వేయించుచుండగా గర్భంలో ఉన్న ఆ పిల్లవాడు సావధానంగా వింటున్నాడు. ఇంతలో హఠాత్తుగా స్వరం తప్పింది అన్న మాటలు ఏకపాదుడికి వినపడింది.

అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనబడలేదు. తిరిగి తన పని కొనసాగించ సాగాడు. మరోసారి స్వరం తప్పినది అన్న పలుకులు వినిపించాయి.

అంతే కాదు నిద్రాహారాలు లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని కూడా వినిపించింది. హైపిచ్ కావటంతో తన భార్యే ఆ మాటలు అన్నదనుకుని ఆమె వైపు కోపంగా చూశాడు. కాదు. నేను కాదని చెప్పింది. అప్పుడు గ్రహించాడు. ఆ మాటలు సుజాత గర్భం నుంచి వస్తున్నాయని. తన కొడుకే, ఇంకా పూర్తిగా రూపురేఖలు సంతకించుకోని, గర్భవాసియైన వాడే తనని ఆక్షేపించాడు.

తండ్రిని తప్పుపట్టినాడు. పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు ఏకపాదుడు.

చూడండి. తండ్రి. తపస్వి. వేద వేదాంగాలు నేర్చిన వాడు. శతాధికముగా శిష్యులు కలిగిన వాడు. అవతల ఉన్నది పూర్తిగా రూపు దిద్దుకోని గర్భస్త శిసువు. అయినా కోపాన్ని, అసూయను, అహాన్ని అణచుకోలేక అష్టవక్రములతో జన్మించమని శపించాడు.

మరి అనంతరామ శర్మ మానవమాత్రుడు. పైగా తండ్రి కానివాడు (pun is absolutely intended). తనకన్నా చిన్నవాడైన గంగాధరం తనకు మించిన ప్రతిభను చూపితే భరించగలడా?

అష్టావక్రుడు తన తండ్రి శాపాన్ని పట్టించుకోలేదు. ఎంత వరకూ విలువ ఇవ్వాలో అంత వరకే విలువ ఇచ్చాడు. ఆ పైన తన పని తాను చూసుకున్నాడు.

If you give too much value to others and invest all your life around someone who doesn’t deserve it or hate you, you’ll pay the price.

మంత్రపుష్పం సంఘటన తరువాతే గంగాధరం అనంతరామ శర్మ గురించి మర్చిపోవలసినది. కానీ ఆ పని చేయలేదు.

పైగా తనకు ఆయననొక బెంచ్మార్క్ లాగా భావించాడు.

తన స్థాయిని మించిన లక్షంతో పని చేయాలి. అప్పుడే ఎదుగుదల. తన స్థాయిని తానే తగ్గించికోవటమంత ఘోరమైన పాపం ఇంకోటి ఉండదు. అలాంటి వారి జీవితాలు అధోగతిపాలు అవుతాయి. అట్లాస్ ష్రగ్డ్ లో ప్రొఫెసర్ రాబర్ట్ స్టేడ్లర్ (the physicist who teaches the trio of John Galt, Fran-cisco d’Anconia, and Ragnar Danneskjöld in the Patrick Henry University) పాత్ర ద్వారా ఈ విషయాన్నే చెప్తుంది Ayn Rand.

If you don’t work out your complete potential, you’ll be rotten in real life itself అనేది ఆమె చెప్పిన సూత్రం. ఇది ఎంత నిజమో అందరికీ తెలుసు.

ప్రపంచమే సంగీతమైన గంగాధరం సంగీతమే ప్రపంచమైన అనంతరామ శర్మకు దాసోహమనబోవటం.. an unpardonable sin.

Why? You may ask.

(కలుద్దాం)

Exit mobile version