[box type=’note’ fontsize=’16’] చికాకులను తొలగించుకుని మనసుకి పరావర్తన లక్షణం అలవర్చుకుంటే విజయం వరిస్తుందని చెబుతున్నారు కె.వి.సుబ్రహ్మణ్యం ‘విజయానికి దారి’ అనే ఈ కవితలో. [/box]
[dropcap]గుం[/dropcap]డెలో బాధని గూడు
కట్టుకోనిస్తే అది గుడ్లు పెట్టి
పొదిగి పిల్లల్ని చేస్తుంది.
బాధలు, పక్షి పిల్లల్లా
పెరుగుతాయి.
వాటికి రెక్కలొచ్చి ఎగిరి
పోయే వరకూ…తట్టుకోవాలి.
లేదా చెప్పుకోడానికి
మనసు విప్పుకోడానికీ
ఒకరు కావద్దూ?
కలం తెరిచి
కాగితం పరిచి మనసు
విప్పుకుంటే ‘పిట్ట’ కష్టాలు
రెక్కలొచ్చి ఎగిరిపోవూ?
గుండె రాయిగా చేసి
దాన్ని (పక్షిని) రానీయవద్ధు.
మనసుకి పరావర్తన లక్షణం
అలవాటు చేసుకుంటే విజయం
నిన్ను వరించదూ?